ఉమ్రాన్ మాలిక్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన పాక్ క్రికెటర్

ABN , First Publish Date - 2022-05-13T23:45:02+05:30 IST

ఇస్లామాబాద్ : ఐపీఎల్ 2022 (IPL 2022) యువ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) పేసర్ ఉమ్రాన్ మాలిక్ ( Umran malki ) వేగవంతమైన బంతులు సంధిస్తూ అబ్బురపరుస్తున్నాడు.

ఉమ్రాన్ మాలిక్‌ను ప్రశంసల్లో ముంచెత్తిన పాక్ క్రికెటర్

ఇస్లామాబాద్ : ఐపీఎల్ 2022 (IPL 2022) యువ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) పేసర్ ఉమ్రాన్ మాలిక్ ( Umran malki ) వేగవంతమైన బంతులు సంధిస్తూ అబ్బురపరుస్తున్నాడు. గరిష్ఠంగా గంటకు 156 కిలోమీటర్ల వేగంతో వేస్తున్న బంతులకు క్రికెట్ ఫ్యాన్స్‌తోపాటు మాజీ క్రికెట్ దిగ్గజాలు సైతం వారెవా అంటున్నారు. అదరగొడుతున్నాడంటూ ఉమ్రాన్ మాలిక్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతిత్వరలోనే జాతీయ జట్టుకు ఆడడం ఖాయమని విశ్లేషణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ వికెట్ కీపర్ Kamran akmal ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 


ఉమ్రాన్ మాలిక్ పాకిస్తాన్‌లో ఉండివుంటే ఈపాటికే అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఉండేవాడేమోనని అన్నాడు. జమ్ముకాశ్మీర్‌కు చెందిన ఈ పేసర్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేవాడని ప్రశంసించాడు. ఉమ్రాన్ మాలిక్ ఎకానమీ ఎక్కువగానే ఉన్నప్పటికీ.. క్రమం తప్పకుండా వికెట్లు తీయగలిగే సామర్థ్యం ఉన్న బౌలర్ అని కొనియాడాడు. ఆధునిక క్రికెట్‌లో షోయబ్ అక్తర్, బ్రెట్ లీలకు సమానంగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడని కొనియాడాడు. అక్తర్, బ్రెట్ కూడా పరుగులిస్తారు. కానీ వికెట్లు తీస్తారని పేర్కొన్నాడు. నాణ్యత కలిగిన ఫాస్ట్ బౌలర్లను వెలికితీయడంలో మార్పులు తీసుకొచ్చిన ఇండియన్ క్రికెట్‌ను కూడా అతడు మెచ్చుకున్నాడు. ఇదివరకు భారత జట్టులో నాణ్యత కలిగిన ఫాస్ట్ బౌలర్ల కొరత ఉండేది. అయితే ఇప్పుడు మంచి బౌలర్లు ఉన్నారని పేర్కొన్నాడు. ప్రస్తుతం నవదీప్ షైనీ, మొహమ్మద్ సిరాజ్, షమీ, జస్ర్పీత్ బుమ్రా వంటి పేసర్లు ఉన్నారని గుర్తుచేశాడు. ఉమేష్ యాదవ్ కూడా చక్కటి వేగంతో బంతులు వేయగలడు. మొత్తం 10 -12 మంది బౌలర్లు ఉన్నారు. వీరిని ఎంపిక చేయడం సెలక్టర్లకు క్లిష్టమవుతుందని కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. 11 మ్యాచుల్లో 15 వికెట్లతో ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్-2 స్థానంలో కొనసాగుతున్నాడు.

Read more