Advertisement

‘పటిష్ట చర్యలతో కోవిడ్-19 మూడో ప్రభంజనాన్ని ఆపవచ్చు’

May 7 2021 @ 18:02PM

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి కట్టడికి గట్టి చర్యలు చేపడితే మూడో ప్రభంజనం ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వపు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ కే విజయ్ రాఘవన్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఎంత సమర్థవంతంగా రాష్ట్రాలు, నగరాలు, జిల్లాలు, గ్రామాలు, స్థానిక స్థాయిలో అమలు చేస్తాయనేదానిపైనే ఇదంతా ఆధారపడి ఉందన్నారు. విజయ్ రాఘవన్‌ను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఈ వివరాలను శుక్రవారం వెల్లడించింది. 


అయితే బుధవారం ఆయన మాట్లాడుతూ, మూడో ప్రభంజనం తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 వ్యాపిస్తున్న తీవ్రతనుబట్టి మూడో ప్రభంజనం తప్పదని అర్థమవుతోందని, అది ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేమని,  దీనికి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. 


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.