గాయత్రీదేవి నమోస్తుతే...

ABN , First Publish Date - 2022-09-29T05:45:29+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో మూడవ రోజైన బుధవారం వేడుకలు ఘనంగా జరిగాయి.

గాయత్రీదేవి నమోస్తుతే...
వీరభద్రాలయంలో గాయత్రిదేవి అలంకారంలో భద్రకాళీ అమ్మవారు

రాయచోటి/మదనపల్లె/రాజంపేట : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో మూడవ రోజైన బుధవారం వేడుకలు ఘనంగా జరిగాయి. రాయచోటి పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కొత్తపేట రామాపురం చౌడేశ్వరిదేవి ఆలయంలో రాజరాజేశ్వరిదేవిగా, ప్రాచీన అగస్తేశ్వరాలయంలో గాయత్రీదేవి అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. మదనపల్లె పట్టణంలోని వాసవీభవన్‌ వీధిలో గల కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో ఆర్యవైశ్య మహిళాసంఘాల సభ్యులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొని గాయత్రీదేవి అలంక రణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కోర్టు ఆవరణలో ఉన్న గంగమ్మ ఆలయంలో అమ్మవారిని గంధంతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. రాజంపేట పట్టణంలో బుధవారం రాత్రి అమ్మవారి మెరవణి కార్యక్రమం కనులవిందుగా సాగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు చేసిన కోలాటం పలువురిని ఆకట్టుకుంది. అమ్మ వారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 







 

Updated Date - 2022-09-29T05:45:29+05:30 IST