
లక్నో: జ్ఞానవాపి మసీదు వీడియోగ్రఫీలో (Gyanvapi mosque videography) శివలింగం (Shivlinga) కనిపించడం తనకెంతో సంతోషం కలిగించిందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya) చెప్పారు. మక్కా(Mecca - Saudi Arabia)లో తవ్వకాలు జరిపినా సరే అక్కడ కూడా మహదేవుడు (Lord Mahadev) కనిపిస్తాడని మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఇవి కూడా చదవండి
ఒకప్పుడు తాము కాశీ విశ్వనాథాలయాన్ని సందర్శించినప్పుడల్లా మాతా శ్రింగార్ గౌరికి పూజలు చేసేవాళ్లమని చెప్పారు. మసీదులో వీడియోగ్రఫీ సర్వే వ్యవహారంపై అనవసరమైన వివాదాలు లేవనెత్తుతున్న వారికి అక్కడ లభించిన శివలింగం, ఇతర వస్తువులే సరైన సమాధానమని అన్నారు. మసీదులో మహదేవుడు కనిపించడం శివభక్తులందరికీ కూడా సంతోషం కలిగించే విషయమని చెప్పారు.