మంచి నిద్ర ఉంటేనే..!

Published: Sun, 23 Jan 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మంచి నిద్ర ఉంటేనే..!

జీవక్రియలు సాఫీగా జరగాలంటే మంచి నిద్ర ఉండాల్సిందే. రోజుకి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. నిద్రే శక్తిని ఇస్తుంది. మనల్ని తాజాగా ఉంచుతుంది. చురుకుగా తయారు చేస్తుంది. ఆరోగ్యం బావుండాలంటే ఆరోగ్యకరమైన నిద్ర చాలా అవసరం. 


ఎక్కువగా పని చేయటం వల్ల కూడా నిద్రలేమితో బాధపడతారు. ఈ ప్యాండమిక్‌ సిచ్యువేషన్‌లో కొందరు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో మీటింగ్‌ జరిగే సమయాలు మారుతాయి. ప్రొఫెషనల్‌ బౌండరీస్‌ దాటి పని చేస్తారు. ఇలా చేయడం వల్ల సరైన సమయంలో ఆహారం తినే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో పాటు వేళకు నిద్రపోయేందుకు సమయం అనుకూలించదు. ఈ విషయాన్ని అధికమిస్తే నిద్రకి ఢోకా ఉండదు.

కొందరు వయసుతో సంబంధం లేకుండా అధికంగా శారీరకశ్రమ చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల సరైన నిద్రరాదు. చెమట రాలేట్లు పనిచేయాలి కానీ అధిక పనిచేస్తే నిద్రలేమితో బాధపడాల్సిందే. 

కంప్యూటర్‌ తెర లేదా ఫోన్‌ తెరను అస్తమానం చూస్తే కళ్లకు ఇబ్బంది. దీంతో పాటు మెదడులో కూడా చర్యలు జరుగుతాయి. మెలనిన్‌ ఉత్పత్తి జరుగుతుంది. అందుకే స్ర్కీన్‌టైమ్‌ను సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. ఫోన్లో అధిక సమయం మాట్లాడటం తగ్గించాలి. వీటికి దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన నిద్ర కలుగుతుంది.

కొందరు నిద్రకు ముందు అధికంగా తింటారు. ఇలా తినటం వల్ల కూడా సమస్య ఉంటుంది. మరికొందరు క్వాలిటీ ఫుడ్‌ తినకుండా.. ఏదో చిరుతిల్లు తిని పడుకుంటారు. వీరిద్దరికీ నిద్ర సరిగా పట్టదు. ఈ రెండు పద్ధతులు కాకుండా నిద్రకు ముందు మితంగా ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తింటేనే నిద్ర పడుతుంది. ఉదయాన లేచాక చురుగ్గా ఉంటాం.

కొందరు యాంగ్జయిటీ, ఒత్తిడి, భయంతో బాధపడుతుంటారు. అనవసరమైన ఒత్తిడికి గురవుతుంటారు. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితుల్లో ప్రతి చిన్నదానికి భయపడే జనాలెక్కువ. ఇలాంటి వారికి నిద్ర సరిగా పట్టదు. మానసికంగా సరిగా లేకుండా ఎంత ఆహారం తీసుకున్నా.. ఏమి తిన్నా ఉపయోగం లేదు. ఒంటికి సరిపోదు. నిరంతరం మానసిక సమస్యలతో బాధపడుతుంటే నిద్రలో పలుసార్లు డిస్టర్బ్‌ కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించి, కూల్‌గా ఉంటూ.. టేక్‌ ఇట్‌ ఈజీ పాలసీతోనే ఉంటేనే.. ఆరోగ్యకరమైన నిద్ర పడుతుంది. ఆరోగ్యకరమైన నిద్రనే మనిషి జీవితాన్ని నిర్ణయిస్తుందని మర్చిపోకూడదు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.