రూ.3 లక్షలిస్తే రిజర్వు బ్యాంకులో జాబ్‌ మీదే!

Published: Thu, 30 Jun 2022 05:24:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon

నిరుద్యోగులకు ఘరానా మోసగాడి వల

 ‘‘మీకు భారత రిజర్వు బ్యాంకు హైదరాబాద్‌ శాఖలో ఉద్యోగం కావాలా..? నేను ప్రధాని మంత్రి కార్యాలయంలో పర్సనల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా. మీరు రూ.3 లక్షలు చెల్లిస్తే ఆ ఉద్యోగం మీకు దక్కేలా చేస్తాను.తొలుత రూ. 25వేలు ఇవ్వండి. కొలువులో చేరిన తర్వాతే మిగిలిన డబ్బు ఇవ్వండి’’- ఇవీ నిరుద్యోగులకు వల వేసేందుకు ఆ కేటుగాడు చెప్పే మాటలు. వాటిని విశ్వసించిన ఎంతోమంది అమాయకులు అతడికి రూ. 25 వేలు చెల్లించారు. తీరా విషయం తెలిసిన తర్వాత లబోదిబోమన్నారు. కొంతమంది బాధితులు ఈ ఘరానా మోసగాడి గురించి పీఎంవో దృష్టికి తీసుకెళ్లడంతో మొత్తం వ్యవహారం వెలుగుచూసింది. పీఎంవో అసిస్టెంట్‌ డైరెక్టర్‌  ఇస్సార్‌ ఫిర్యాదు మేరకు హరియాణకు చెందిన ప్రిన్స్‌ అనే నిందితుడిపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.