దమ్ము, ధైర్యం ఉంటే ఎదురుగా రా.. తేల్చుకుందాం!

ABN , First Publish Date - 2022-06-29T05:37:41+05:30 IST

ఇసుక అక్రమ రవాణ, భూకబ్జాలపై ప్రశ్నించిన మా పార్టీ నాయకులపై దొంగచాటుగా దాడులు చేయడం కాదు... దమ్ము, ధైర్యం ఉంటే ముందుకురా తేల్చుకుందామని.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ సవాల్‌ విసిరారు.

దమ్ము, ధైర్యం ఉంటే ఎదురుగా రా.. తేల్చుకుందాం!
మీడియాతో మాట్లాడుతున్న గోనుగుంట్ల సూర్యనారాయణ

ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డికి గోనుగుంట్ల సవాల్‌

అనంతపరం సెంట్రల్‌, జూన 28: ఇసుక అక్రమ రవాణ, భూకబ్జాలపై ప్రశ్నించిన మా పార్టీ నాయకులపై దొంగచాటుగా దాడులు చేయడం కాదు... దమ్ము, ధైర్యం ఉంటే ముందుకురా తేల్చుకుందామని.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ సవాల్‌ విసిరారు. మంగళవారం ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన దాడిలో తీవ్రగాయాలపాలై నగరంలోని ప్రవేట్‌ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న బీజేపీ నాయకులను ఆపార్టీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌, గోనుగుంట్ల సూర్యానారాయణ పరామర్శించారు. అనంతరం సత్యకుమార్‌తో కలిసి గోనుగుంట్ల సూర్యానారాయణ విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణాతో కోట్లు గడిస్తున్నాడన్నారు. నిత్యం 200 ఇసుక లారీలను కర్ణాటకకు తరలిస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే తన కంకర మిషన ద్వారా టిప్పర్‌ను రూ.15వేలకు అమ్ముకుని ఇతరులు కేవలం రూ.8వేలకు విక్రయించాలని ఆదేశిస్తున్నాడన్నారు. ఇతర కంకర టిప్పర్లు కనబడితే రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తున్నారన్నారు. అదేవిధంగా సబ్‌ రిజిసా్ట్రర్‌, ఆర్డీఓ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగాలంటే ఎమ్మెల్యేను కలసి డబ్బులు ముట్టచెప్పుకోవాల్సిందేనని గోనుగుంట్ల ఆరోపించారు. సబ్‌రిజిసా్ట్రర్‌కు  సంబంధించిన డిజిటల్‌ కీని ఎమ్మెల్యే ఇంట్లో పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఈ దారుణాలను బీజేపీ నిత్యం ప్రజల ముందు పెట్టడాన్ని సహించలేకనే వైసీపీ ప్లీనరీ సమావేశంలో మమ్మల్ని చంపుతాం, పొడుస్తామని బెదిరింపులకు పాల్పడున్నాడన్నారు. చెప్పినవిధంగానే మంగళవారం రాడ్లు, కట్టెలతో ప్రెస్‌క్లబ్‌లోకి దూరి ధర్మవరం రరల్‌ కన్వీనర్‌ అరవిందరెడ్డి, మండలాధ్యక్షుడు డిష్‌రాజు, ఎస్సీ మోర్చ మండలాధ్యక్షుడు తుంబర్తి పరమేష్‌, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రామాంజినేయులు, ఆదెప్ప, ఆప్పస్వామిపై విచక్షణా రహితంగా దాడిచేసి తలలు పగలగొట్టారన్నారు. ఈ విధంగా దొంగదెబ్బ తీస్తే ప్రజలు ఉపేక్షించే పరిస్థితులు లేవన్నారు. వెంకట్రామిరెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తుల చిట్టాను బయటకు తీస్తానన్నారు. అనంతరం డీఐజీ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డితో పాటు దాడిలో పాల్గొన్న వారిపై హత్యాయత్నం కేసులు నమోదుచేయాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్‌, బీజేపీ శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల అధ్యక్షులు వజ్ర భాస్కర్‌రెడ్డి, సందిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర అధికార ప్రనితిధి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T05:37:41+05:30 IST