నా బిడ్డ మేఘకు మీరు సాయం చేస్తే...

ABN , First Publish Date - 2022-03-01T18:40:58+05:30 IST

ట్రాన్స్‌ప్రాంట్ జరుగకుండా ఒక్కో రోజూ గడుస్తుంటే.... ప్రమాదానికి నా బిడ్డ మేఘ దగ్గరవుతోంది. తను జీవన్మరణ పోరాటం చేస్తోంది. ఇప్పుడు ఏమీ చెయ్యలేకపోతే ఆమె బతకడం కష్టం....

నా బిడ్డ మేఘకు మీరు సాయం చేస్తే...

ట్రాన్స్‌ప్రాంట్ జరుగకుండా ఒక్కో రోజూ గడుస్తుంటే.... ప్రమాదానికి నా బిడ్డ మేఘ దగ్గరవుతోంది. తను జీవన్మరణ పోరాటం చేస్తోంది. ఇప్పుడు ఏమీ చెయ్యలేకపోతే ఆమె బతకడం కష్టం. ఏళ్ల తరబడి చేసిన ప్రార్థనలు... ప్రయత్నాల తర్వాత నాకు అందమైన బిడ్డ పుట్టింది. నా ఆనందానికి హద్దులు లేవు. కానీ, ఒక్క వారమైనా గడవక ముందే అంతా తల్లకిందులైపోయింది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం అంతలోనే మటుమాయమవుతుందని మేం కలలో కూడా ఊహించలేదు. 'మేఘ పుట్టిన కొన్ని రోజులకు తన పొట్ట ఉబ్బడం నేను గమనించాను. బిడ్డ శరీరం పాలిపోతేంది. మలమూత్ర విసర్జన అసాధారణంగా ఉంది. ఇంకేమీ ఆలస్యం చెయ్యకుండా నేను తనను ఆస్పత్రికి తీసుకెళ్ళాను.


మేఘకు సాయం చెయ్యడానికి ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి


అమ్మాయికి డాక్టర్లు రకరకాల స్కానింగ్‌లు, పరీక్షలు చేశారు. పరిస్థితి అనుకూలంగా లేదని నాకు అనిపించింది. "మేఘ శరీరంలో పిత్తాశయం (gallbladder) పూర్తిగా ఏర్పడలేదని, తనకు శస్త్రచికిత్స చెయ్యాలి..." అని డాక్టర్లు వివరించారు. తన కోసం మేము తమిళనాడు నుంచి ఢిల్లీకి మారాం. మా అమ్మాయికి సర్జరీ కోసం మా బంధువులు ధన సహాయం చేశారు. కానీ, మా కష్టాలు అంతటితో తీరలేదు. సర్జరీతో పాటుగా మా అమ్మాయికి కాలేయ మార్పిడి జరగాలని కూడా డాక్టర్లు చెప్పారు. అందుకు రూ.22 లక్షల వరకూ ఖర్చవుతుందని, ఇది జరగకపోతే మేఘ జీవితానికే ముప్పు అని అన్నారు. ఆ మాటలు నాకు పెను ఘాతంలా అనిపించాయి. నా కాలికింద భూమి కంపించిపోయింది.


మేఘకు సాయం చెయ్యడానికి ఈ లింక్‌పై క్లిక్ చెయ్యండి


నా బిడ్డ ఇప్పుడు ఆక్సిజన్ సపోర్ట్‌తో బతుకుతోంది. తను అంత వేదనకు గురికావడం నేను భరించలేకపోతున్నాను. నెలలు గడిచిపోతున్నాయి. పాపాయికి జరగాల్సిన కాలేయ మార్పిడికి కావలసిన డబ్బు సంపాదించడానికి మాకు మరో మార్గం లేదు. తల్లిగా నేను విఫలమవుతున్నాను. ఈ జబ్బుకు నా బిడ్డ బలికాకుండా కాపాడండి. నా భర్త తమిళనాడులో ఒక ప్రయివేట్ ఉద్యోగి. తన జీతం నెలకు కేవలం రూ.7,000 మాత్రమే. మేం ఢిల్లీ వచ్చిన తర్వాత డబ్బు సమకూర్చుకోవడం ఇంకా కష్టంగా మారింది. మాది నిరుపేద కుటుంబం. ఉన్న కాస్తంతా అమ్మాయి సర్జరీకి, మందుల కోసం ఖర్చు చేసేశాం. ఇక మేఘా కాలేయ మార్పిడికి అవసరమేన రూ.22 లక్షలు సంపాదించడం మా ఊహకే అందని విషయం.


ఈ పరిస్థితుల్లో మీరే మా ఏకైక ఆశ, ఆధారం. మీరిచ్చే ప్రతి రూపాయి మా అమ్మాయికి ఆయుష్షు పెరగడానికి ఆధారమవుతుంది. అందువల్ల, నా చిన్నారిని కాపాడుకోవడానికి పెద్ద మనస్సుతో విరాళం ఇవ్వాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. 


(ఈ కేసుకు సంబంధించిన వాస్తవ విషయాలను ఆస్పత్రిలోని వైద్య బృందం ద్వారా నిర్ధారించడం జరిగింది. చికిత్స లేదా సంబంధిత ఖర్చులకు సంబంధించిన ఏ సమాచారం కోసమైనా సదరు వైద్య బృందాన్ని లేదా ఈ క్యాంపెయిన్ ఆర్గనైజర్‌ని సంప్రదించవచ్చు. Charity No: 81677715)


గమనిక: ఈ నిధి సేకరణకర్తకు అందించే విరాళాలు  80G, 501(c) వంటి పన్ను మినహాయింపు పరిధిలోకి రావు.



Updated Date - 2022-03-01T18:40:58+05:30 IST