అవమానిస్తే అంతు చూస్తా..

ABN , First Publish Date - 2022-09-27T04:53:21+05:30 IST

కౌన్సిల్‌ పట్ల అవమానకరంగా మాట్లాడితే అంతు చూస్తానంటూ మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌.కేశవ్‌, కమిషనర్‌ జానకీరామ్‌ సాగర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అవమానిస్తే అంతు చూస్తా..
సమావేశంలో మాట్లాడుతున్న మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌

- మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ ఘాటు వ్యాఖ్య 

- కౌన్సిల్‌ సమావేశంలో బిల్లుల రగడ 


గద్వాల టౌన్‌, సెప్టెంబరు 26: కౌన్సిల్‌ పట్ల అవమానకరంగా మాట్లాడితే అంతు చూస్తానంటూ మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌.కేశవ్‌, కమిషనర్‌ జానకీరామ్‌ సాగర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సోమవారం జరిగిన మునిసిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో పార్కుల నిర్వహణకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయం రసాబాసగా మారింది. గత ఫిబ్రవరి నెల నుంచి ఆగస్టు చివరి వరకు పార్కుల నిర్వహణ కోసం రూ.10లక్షల మే రకు బిల్లులు మంజూరు చేయగా, ఇందుకు సంబంధించిన నోట్‌ ఫైల్‌పై డీఈ లేదా ఏఈల సంతకం లేకుండా మంజూరు చేయడం నిబంధనలకు విరుద్ద మంటూ కౌన్సిలర్‌ త్యాగరాజు అభ్యంతరం వ్యక్తం చేయగా, సభ్యులందరూ పార్టీలకతీతంగా ఏకీభవించారు. ఇదే విషయంపై చైర్మన్‌ మాట్లాడుతుండగా సమాధానమిచ్చిన కమిషనర్‌, కౌన్సిల్‌ అనుమతి లేకున్నా కలెక్టర్‌ ఆదేశాలతో బిల్లులు విడుదల చేయవచ్చంటూ చేసిన వ్యాఖ్యలతో చైర్మన్‌ తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రజాప్రతినిధులను అవమానించడమేనని, అధి కారుల ఆదేశాలతోనే అన్నిరకాల బిల్లులు మంజూరు చేస్తామంటే ఇక కౌన్సిల్‌ ఎందుకంటూ నిలదీశారు. ఈ సందర్భంగా మరోసారి ఆగ్రహించిన చైర్మన్‌, కౌ న్సిల్‌ అనుమతి లేకుండా బిల్లులు విడుదల చేయడం దొంగతనమేనంటూ కమి షనర్‌పై ధ్వజమెత్తారు. కాగా, కౌన్సిల్‌ ఆమోదం అనంతరమే తాము బిల్లులు విడుదల చేశానని, ఇందులో నిబంధనల ఉల్లంఘన ఏమీలేదని కమిషనర్‌ స మాధానమిచ్చారు. వాస్తవానికి కౌన్సిల్‌ ఆమోదం తెలిపిన ఏజెన్సీ పేరున జా యింట్‌ అకౌంట్‌ ఉన్న బ్యాంకు ఖాతా పేరుపై బిల్లు చెల్లించాల్సి ఉండగా, అం దుకు విరుద్ధంగా వ్యక్తి పేరుపై ఉన్న ఎస్‌బీ అకౌంట్‌ పేరున బిల్లుకు సంబం ధించిన చెక్‌ను కమిషనర్‌ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. 

Updated Date - 2022-09-27T04:53:21+05:30 IST