ఇష్టపడి చదివితే విజయం సాధిస్తారు : భగత

Published: Tue, 05 Jul 2022 01:12:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇష్టపడి చదివితే విజయం సాధిస్తారు : భగత అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే భగత

హాలియా, జూలై 4: ఇష్టపడి చదివితే తప్పకుండా విజయం సాధిస్తారని, ప్రతి ఒక్కరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే నోముల భగత అన్నారు. సోమవారం హాలియా మునిసిపాలిటీలో ఎనఎల్‌ ఫౌండేషన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్‌-1,2,3,4,5, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు తన తల్లి నోముల లక్ష్మితో కలిసి ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన విడుదల చేసిన నేపథ్యం లో అభ్యర్థుల సౌకర్యార్థం నోముల ఫౌండేషన ఆధ్వర్యంలో శిక్షణ ఇ చ్చినట్లు పేర్కొన్నారు. బాగా చదివి ఉద్యోగం సాధించాలని, రాకు న్నా బాధపడకుండా ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సురే్‌షకుమార్‌, ఎస్‌ఐలు క్రాంతికుమార్‌, శోభనబాబు, మునిసిపల్‌ చైర్‌పర్సన సలహాదారుడు వెంపటి శంకరయ్య, నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, నల్లగొండ సుధాకర్‌, వెంకట్‌రెడ్డి, వెంకటయ్య, ప్రసాద్‌నాయక్‌, ముత్యా లు, వెంకన్న, సత్యం, రాంబాబు, నాగయ్య పాల్గొన్నారు.   


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.