కనిపిస్తే జాగా.. వేసెయ్‌ పాగా..!

ABN , First Publish Date - 2022-09-28T06:13:07+05:30 IST

నిత్యం సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. ఆరోపణ లు.. ప్రత్యారోపణలు! ఇవీ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య బహిరంగంగా జరిగేవి.

కనిపిస్తే జాగా.. వేసెయ్‌ పాగా..!
నేతలు అక్రమ లేఅవుట్‌ వేసి ప్లాట్లు అమ్ముతున్న భూమి

రూ.4 కోట్ల విలువైన అసైన్‌మెంట్‌  భూమిని ప్లాట్లుగా మార్చిన నేతలు

ఇరు పార్టీల వారూ సిండికేట్‌ 

చోద్యంచూస్తున్న రెవెన్యూ, నగరపంచాయతీ అధికారులు

పొదిలి రూరల్‌, సెప్టెంబరు 27: నిత్యం సవాళ్లు.. ప్రతి సవాళ్లు.. ఆరోపణ లు.. ప్రత్యారోపణలు! ఇవీ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య బహిరంగంగా జరిగేవి. మరోపక్క సిండికేట్‌ రాజకీయాలు, అక్రమ సంపాదనలో మాత్రం ఇరుపార్టీల నేతలు ఎంచక్కా సర్దుబాటు ధోరణితో ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వభూమి కనిపిస్తే గద్దల్లా వాలిపోతున్నారు. ఏమాత్రం వెనుకా ముందూచూడకుండా పంచుకుతింటున్నారు. వీరి వ్యవహారశైలి పట్టణ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పొదిలి పట్టణంలో సర్వే నెంబరు 223-1, 2, 3లో మొత్తం 7 ఎకరాల 35సెంట్ల భూమి ఉంది. అందులో 223-1లో 3 ఎకరాలు ఇళ్లస్థలాలకు ప్రభుత్వం గతంలో పట్టాలిచ్చినట్లు అధికారులు తెలిపారు. 223-2లో బీసీ హాస్టల్‌ పక్కన ఉన్న 4 ఎకరాల 12 సెంట్ల భూమిని ఈసంపల్లి పాచ్చాభీకి అసైన్‌మెంట్‌ పట్టాను ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 ఎకరాల 12సెంట్లపై ఇరుపార్టీల నేతలు కన్నేశారు.  ఆ భూమిని తాము కొనుగోలు చేశామని అక్రమంగా వెంచరు వేసి అమ్మకాలు సాగిస్తున్నారు.  అధికార పార్టీ నాయకులతో ప్రతిపక్షం వారు  కలిసిపోవడంతో అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ప్రజల అవసరాలను సొమ్ము చేసుకో వడంలో నేతలు సర్దుబాటు ధోరణితో వ్యవహ రించారు. రూ.4కోట్ల ప్రభుత్వ భూమిని అప్పనంగా ఆక్రమిం చుకొని సొమ్ము చేసుకుం టుంటే అటు రెవెన్యూ అధికారులుగానీ, ఇటు నగరపంచా యతీ అధికారులు గానీ పట్టించు కోకపోవడం విమర్శలకు తావి స్తోంది.  సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం బయటకు పొక్కడంతో కేవలం అధికారులు హద్దురాళ్లను తొలగించి నామమాత్రపు చర్యలతో మమ అనిపించారు. 


Updated Date - 2022-09-28T06:13:07+05:30 IST