రైటర్‌ కావాలంటే బాగా చదవాల్సిందే!

ABN , First Publish Date - 2022-06-23T08:10:09+05:30 IST

రస్కిన్‌బాండ్‌ 1934లో అవిభాజ్య ఇండియాలో బ్రిటిష్‌ దంపతులకు జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులో బాండ్‌ తల్లిదండ్రులు విడిపోయారు.

రైటర్‌ కావాలంటే బాగా చదవాల్సిందే!

స్కూలింగ్‌ పూర్తి కాగానే తొలి నవల రాసిన రస్కిన్‌బాండ్‌ ఏడు పదుల వయసొచ్చినా ఇంకా రాస్తూనే ఉన్నారు. తన నవలలతో ఎంతో మందిని అభిమానులను సంపాదించుకున్న రస్కిన్‌బాండ్‌ విశేషాలు ఇవి..

రస్కిన్‌బాండ్‌ 1934లో అవిభాజ్య ఇండియాలో బ్రిటిష్‌ దంపతులకు జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులో బాండ్‌ తల్లిదండ్రులు విడిపోయారు. 

సిమ్లాలోని బిషప్‌ కాటన్‌ స్కూల్‌లో రస్కిన్‌ విద్యాబ్యాసం జరిగింది. స్కూలింగ్‌ పూర్తయ్యాక యూకేలోని తన అంటీ దగ్గరకు వెళ్లారు. అప్పుడే ‘ద రూమ్‌ అన్‌ ద రూఫ్‌’ పేరుతో మొదటి నవల రాశారు. రస్టీ అనే ఆంగ్లోఇండియన్‌ బాలుడి  కథ ఇది. ఈ నవలలో రస్కిన్‌ బాల్యంలోని దుఃఖం కనిపిస్తుంది. 

ప్రతి సోమవారం ముస్సోరిలోని కేంబ్రిడ్జ్‌ బుక్‌ డిపోలో అభిమానుల కోసం పుస్తకాలపై తన సంతకం చేసి అందిస్తుంటారు.

రస్కిన్‌ బాండ్‌ పుస్తకాలను తన స్వదస్తూరీతోనే రాస్తారు. టైప్‌రైటర్‌ గానీ, కంప్యూటర్‌ గానీ ఉపయోగించరు.

ఆయనకి పచ్చళ్లంటే చాలా ఇష్టం. అల్లం, నిమ్మకాయ, మామిడికాయ పచ్చడిని తెగ ఇష్టపడతారు.

ఒకే కేటగిరీకి పరిమితం కాకుండా ఘోస్ట్‌ స్టోరీస్‌, ఫ్రెండ్‌షిప్‌, సూపర్‌హీరోస్‌, చిల్డ్రన్‌ ఫిక్షన్‌, ఫాంటసీ ఫిక్షన్‌.... ఇలా రకరకాల థీమ్స్‌లో నవలలు రాశారు.

 ‘జునూన్‌’, ‘ఎ ఫ్లైట్‌ ఆఫ్‌ పీజియన్స్‌’, ‘ద బ్లూ అంబరెల్లా’ వంటి చిత్రాలు ఆయన రాసిన నవలలను ఆధారంగా చేసుకుని తీసినవే.

రైటర్‌ కావాలనుకునే వారు పుస్తకాలు చదవడాన్ని హాబీగా చేసుకోవాలని రస్కిన్‌ బాండ్‌ సూచిస్తుంటారు. పుస్తకాల పురుగుగా మారినప్పుడే రాయడానికి వీలవుతుంది అంటారు. 

ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని, అప్పుడు మంచి మంచి ఆలోచనలు తడతాయని అంటారు రస్కిన్‌ బాండ్‌.

సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలను ఆయన అందుకున్నారు. 

Updated Date - 2022-06-23T08:10:09+05:30 IST