ముఖారవిందం పెరగాలంటే...

Sep 20 2021 @ 01:57AM

బ్యూటీ

మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు పోగొట్టుకోవడానికి, ముఖారవిందం పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఫేస్‌ప్యాక్‌లతో ముఖారవిందాన్ని పెంచుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే...


మొటిమలు గిల్లడం వల్ల ఏర్పడిన మచ్చలు పోవాలంటే ముల్తానీ మట్టి ఫేస్‌ప్యాక్‌ వాడాలి. ముల్తానీ మట్టిలో మెగ్నీషియం క్లోరైడ్‌ ఉంటుంది. ఇది మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగిస్తుంది.


ఈ ప్యాక్‌ ఎలా తయారుచేసుకోవాలంటే... 

ఒక బౌల్‌లో రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని అందులో అర టీస్పూన్‌ పసుపు, అర టీస్పూన్‌ గంధం, నిమ్మరసం వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి బాగా ఆరేంత వరకు ఉంచాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారంలో రెండు రోజులు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


 ముఖారవిందం పెరగడానికి, కాంతిమంతం కావడానికి కుంకుమపువ్వుతో తయారుచేసే ఫేస్‌ప్యాక్‌ని ఉపయోగించాలి. కుంకుమపువ్వులో ఐరన్‌, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్‌, కాపర్‌, విటమిన్‌-ఎ, ఫోలిక్‌యాసిడ్‌, నియాసిన్‌ ఉంటాయి. ఈ ప్యాక్‌తో ముఖారవిందం పెరుగుతుంది. డార్క్‌ సర్కిల్స్‌ దూరమవుతాయి. ఈ ప్యాక్‌ ఎలా చేసుకోవాలంటే...


ఒక బౌల్‌లో రెండు టీస్పూన్ల నీళ్లు తీసుకుని అందులో కుంకుమపువ్వు వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన ఆ నీళ్లు బంగారు వర్ణంలోకి మారతాయి. ఇప్పుడు వాటిలో ఒక టీస్పూన్‌ పాలు, కొద్దిగా పంచదార, రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె వేసి కలపాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి లేయర్‌లా పట్టించాలి. దాదాపు పావుగంట పాటు వదిలేయాలి. బాగా ఆరిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు, మూడు సార్లు ఈ ఫేస్‌ప్యాక్‌ ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. ముఖారవిందం పెరుగుతుంది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.