11 Foods That Are Killing You Slowly: ఎక్కువ కాలం జీవించాలనుకుంటే వీటిని తినకుండా ఉండటమే బెటర్..

ABN , First Publish Date - 2022-08-22T19:37:35+05:30 IST

ఈ పదార్ధాలను తీసుకోవడం వల్ల అనారోగ్వం బారిన పడటమే కాకుండా మన ఆయుష్షు కూడా తగ్గుతుందట.

11 Foods That Are Killing You Slowly: ఎక్కువ కాలం జీవించాలనుకుంటే వీటిని తినకుండా ఉండటమే బెటర్..

రుచికరమైన ఆహారాన్ని తీసుకోవడం, కంటినిండా నిద్రపోవడం ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. సరైన ఆరోగ్య పద్దతులను పాటిస్తూ మనమంతా దీర్ఘాయువును కోరుకుంటాము. కానీ నేటి జీవన శైలికి తగ్గట్టు అన్నీ ఫాస్ట్ ఫుడ్ పద్దతులనే మనం ఎంచుకుంటున్నాం. వరల్డ్ లైఫ్ ఎక్స్ పెక్టెన్సీ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో పురుషులు 69.5 సంవత్సరాలలో, స్త్రీలు 72.2 సంవత్సరాలు రాగానే గుండె జబ్బులు, ఊపిరితిత్తులు దెబ్బతినడం, పక్షవాతం, మధుమేహం వంటి అనేక వ్యాధులు మరణానికి కారణమవుతున్నాయి. దీనంతటికీ మన రోజువారి ఆహారపు అలవాట్లే ఈ వ్యాధులు రావడానికి కారణం అవుతున్నాయి. ప్రతిరోజూ మనం ఉపయోగించే కొన్ని అనారోగ్య ఉత్పత్తులు కూడా దీనికి ప్రధాన కారణం. 


ఈ పదార్ధాలను తీసుకోవడం వల్ల అనారోగ్వం బారిన పడటమే కాకుండా మన ఆయుష్షు కూడా తగ్గుతుందట. మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణుల పరిశోధన ప్రకారం ఒక వ్యక్తి ఒకసారి గింజలను తన ఆహారంలో తీసుకుంటే అవి మన జీవిత కాలాన్ని 26 నిముషాలు పెంచుతాయని ఈ పరిశోధనలు చెపుతున్నాయి. అదే మనిషి తీసుకునే హాట్ డాగ్స్ వల్ల అతని జీవిత కాలం 36 నిముషాలు తగ్గిపోతుంది. అలా మన ఆయుష్షును తగ్గించే పదార్ధాలు ఏమిటనేది తెలుసుకుందాం. వాటికి దూరంగా ఉందాం. 


ప్రాసెస్ చేసిన మాంసం.. తీసుకోవడం వల్ల 26 నిముషాలను తగ్గిస్తుంది.

హాట్ డాగ్ .. 36 నిముషాలు మనిషి జీవిత కాలాన్ని తగ్గిస్తాయి.

శీతల పానీయాలు.. 12.4 నిముషాలు మనిషి జీవిత కాలాన్ని తగ్గిస్తాయి.

చీజ్ బర్గర్.. 8.8 నిముషాలు మనిషి జీవిత కాలాన్ని తగ్గిస్తాయి.

పిజ్జా.. 7.8 నిముషాలు మనిషి జీవిత కాలాన్ని తగ్గిస్తాయి.


అయితే ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే అవి మన ఆయుష్షును పెంచుతాయట.


పీనట్ బటర్.. 33.1 నిముషాలు వరకూ జీవితాన్ని పొడిగిస్తుంది.

కాల్చిన సాల్మన్ ఫిష్.. 13.5 నిముషాలు పెరుగుతుంది.

హంకెలా.. 3.8 నిముషాల కాలం పెంచుతుంది.

టమాటో.. 3.8 నిముషాల కాలం పెంచుతుంది.

అవకాడో.. 1.5 నిముషాలు పాటు జీవితకాలం పెరుగుతుందని ఆ పరిశోధనలు తెలిపాయి. 

ఇందులో మనం మరీ తరుచుగా తీసుకునే ఫుడ్స్ ను గురించి తెలుసుకుందాం.


1. వెన్న (MARGARINE)

వెన్న లేదా వనస్పతి దీనిని ఎక్కువగా వాడటం వల్ల ఇందులోని అధిక శాతం ఉండే ట్రాన్స్ - ఫ్యాట్ గుండెపోటుకు కారణం అవుతాయి. పాలిచ్చే తల్లులు ఈ వనస్పతిని ఎక్కువగా తీసుకోవడం వల్ల తల్లిపాలలో ఉండే పోషకాలు తగ్గే అవకాశం కూడా ఉంది. 


2. సోడా (SODA)

కార్బోనేటేడ్ నీరు, వాసన, తీపి ఈ మూడూ కలిపిన ఈ పానీయాలను తాగడానికి అలవాటు పడ్డాం. ఇవి నెమ్మదిగా మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. ప్రక్టోజ్ వంటి అధిక మొత్తంలో అనవసరమైన చక్కెరలు మీ కాలేయం ద్వారా గ్యూకోజ్ గా మార్చబడతాయి. వీటిని శరీరం దానిని కొవ్వుగా నిల్వ చేస్తుంది. 


3. ఎనర్జీ డ్రింక్స్ (ENERGY DRINKS)

మామూలుగా అలసటగా ఉన్నా, కాస్త నీరసం అనిపించినా వెంటనే శక్తిని ఇచ్చే పానీయాలు అదే ఎనర్జీ డ్రింక్స్ తాగేస్తుంటాం. ఇవి చాలావరకూ కెఫిన్, టౌరిన్, గ్వారానా, బి విటమిన్లు, గ్లూకురోనోలక్టోన్ వంటి శక్తి మిశ్రమాలు కలిగి ఉంటాయి. అవి ఒకటిగా తీసుకోవడం కన్నా ధూమపానం, మధ్యపానం, మారకద్రవ్యాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యానికి హానిచేస్తాయి.


4. పండ్ల రసాలు ( FRUIT JUICES )

టెట్రా ప్యాక్స్ లో వస్తున్న పండ్ల రసాలను ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడుతున్నాం. ఈ ప్యాక్స్ పై 100% పంఢ్లతో ఉందని లేబుల్ లో చూపిస్తున్నా నిల్వ ఉండే పండ్ల రసాలు అంత ఆరోగ్యకరమైనవి కాదు. ఈ పానీయాల తయారీదారులు సాధారణంగా రసాన్ని పెద్ద మొత్తంలో oxygen-depleted holding tanks లలో నిల్వ ఉంచుతారు. దానివల్ల పండ్ల రసం సహజత్వాన్ని కోల్పోతుంది. 


5. తేనె (RAW HONEY)

హానికరమైన టాక్సిన్స్ పాశ్చరైజేషన్ ప్రక్రియ ద్వారా ముడి తేనె తీసుకోవడం వల్ల గ్రేయనోటాక్సిన్ ని కలిగి ఉంటుంది. ఇది 24 గంటల పాటు మైకము, బలహీనత, అధిక చెమట, వికారాన్ని కలిగిస్తుంది.


6. ప్రాసెస్ చేసిన మాంసం ( PROCESSED MEAT)

ప్రాసెస్ చేసిన మాంసాలు అంటే హాట్ డాగ్ లు, బెకన్, సాసేజ్ లు, హామ్ లేదా సలామీ, కార్న్డ్ బీఫ్, స్మోక్డ్ మీట్ లు, బీఫ్ జెర్కీ, సాల్టింగ్, క్యూరింంగ్, క్యానింగ్, డ్రైయింగ్ వంటి ఆహారాలు. ఇవి సాధారణంగా రక్తపోటును పెంచి తీవ్ర అనారోగ్య సమస్యలను తెస్తాయి. ఇవి క్యాన్సర్ కారకమైన నైట్రోసమైన్ లను కలిగి ఉంటాయి. 


7. అల్పాహారం తృణధాన్యాలు (BREAKFAST CEREALS)

చిన్న సూపర్ మర్కెట్ ల నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకూ అన్నింటిలోనూ తృణధాన్యాలతో చేసిన అల్పాహారం ఫ్యాక్స్ తో నిండి ఉంటాయి. ఎంతకాలంగా నిల్వ ఉంచారు అనేది పట్టించుకోకుండా వీటినే ఎక్కువగా తింటున్నాం. 


8. చీజ్ (జున్ను)  CHEESE

జున్ను ఇందులో కాల్షియం విలువైన మూలం అయినప్పటికీ ఇది ఎముకలను బలంగా మారుస్తుంది. ప్రోటీన్, ఫాస్పరస్, రిబోఫ్లావిన్, జింక్ ఇతర విటనమిన్లుA,B12 కలిగి ఉంటుంది. పోశకాహార కారకాలు అయితే దీనిని మరే ఇతర ఆహారంతో కలిపి తీసుకున్నా ఇందులోని పోషకాలు నాశనం అవుతాయి. 


9. ఫ్రెంచ్ ఫ్రైస్ (FRENCH FRIES)

బంగాళ దుంపలను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు అనే నమ్మకం మనలో చాలామందికి ఉంది. ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ అధిక కేలరీలను కలిగి ఉంటుంది. సాధారణంగా హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ లో డీప్ ఫ్రై చేస్తారు, ఈ ఆహారాన్ని తరచుగా తీసుకోవడం వల్ల బరువు త్వరగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.


10. నిల్వ ఉంచిన పదార్ధాలు ( CANNED GOODS)

సరైన సమయానికి భోజనం తయారవలేదని లేదా అలవాటుగా మనం డబ్బాలలో నిల్వ చేసిన పదార్ధాలను తినేస్తూ ఉంటాం. ఇవి దాదాపు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకూ నిల్వ ఉండేలా ఈ పదార్ధాలను తయారు చేస్తారు. క్యానింగ్ పద్దతి ద్వారా ఈ పదార్ధాలను ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేస్తారు. తక్కువ నాణ్యత తో ఎక్కువ శాతం ఉప్పు, చక్కెరను కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. 


11. ఉప్పు 

ఉప్పు అంటే రుచికోసం వాడతాము. ఈ ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. రోజువారి వంటకాల్లో ఉప్పు వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవడం మంచిది. 


Updated Date - 2022-08-22T19:37:35+05:30 IST