ఏపీలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2021-09-19T05:39:59+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన సాగుతోందని, ప్రపంచంలో ప్రమాదకరమైన తీవ్రవాద దేశాల కన్నా ఏపీ దారుణంగా మారిందని, ప్రజలను పరిపాలించే వ్యక్తి తీరు వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఐఎఫ్‌ఎస్‌ అధికారి బుడిగి శ్రీనివాసులురెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో రాక్షస పాలన
మాట్లాడుతున్న శ్రీనివాసులురెడ్డి

తీవ్రవాద దేశాల కన్నా దారుణ పరిస్థితులు

రాష్ట్రపతి పాలన అవసరం

మాకే రక్షణ లేకపోతే సామాన్యుల సంగతేంటి...?

ఐఎఫ్‌ఎస్‌ అధికారి శ్రీనివాసులురెడ్డి 


నెల్లూరు రూరల్‌, సెప్టెంబరు 18 : ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన సాగుతోందని, ప్రపంచంలో ప్రమాదకరమైన తీవ్రవాద దేశాల కన్నా ఏపీ దారుణంగా మారిందని, ప్రజలను పరిపాలించే వ్యక్తి తీరు వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఐఎఫ్‌ఎస్‌ అధికారి బుడిగి శ్రీనివాసులురెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  నెల్లూరు రూరల్‌ మండలంలోని దొడ్ల డెయిరీ సమీపంలో ఉన్న ఆయన నివాసం ప్రహరీని మామిడి కృష్ణారెడ్డి అనే వ్యక్తి కూల్చడంపై శనివారం తన తల్లి లక్ష్మమ్మతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన సర్వీసులో ప్రపంచంలోని అత్యంతం ప్రమాదకరమైన తీవ్రవాద దేశాల్లో పని చేసినా ఇలాంటి దౌర్జన్యాలు చూడలేదన్నారు. తమ ఇంటి ప్రహారీని కూల్చిన వ్యక్తికి రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి అండదండలున్నాయని ఆరోపించారు. ఆయన అండ చూసుకుని నెల్లూరులోని గూండాలు రెచ్చిపోతున్నారని విమర్శించారు.


కృష్ణమోహన్‌రెడ్డి పనే ఇది

ముఖ్యమంత్రి వద్ద ఓఎస్డీగా పని చేస్తున్న కృష్ణమోహన్‌రెడ్డి ప్రొద్బలంతోనే తనపై  దౌర్జన్యం చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. గతంలో 4 వీసాలు ఇవ్వాలని డిమాం డ్‌ చేయగా అందుకు తాను అంగీకరించలేదని తెలిపారు. ఆయన తండ్రి దాడి చేసిన విషయంలో కేసు పెట్టగా దానిని వెనకకు తీసుకోవాలని కోరారని, అందుకు తాము ఒప్పుకోనందు వల్లే మామిడి కృష్ణారెడ్డితో ప్రహరీని ధ్వంసం చేయించారని ఆరోపించారు. దీనిని అడ్డుకోబోయిన తన తల్లి లక్ష్మమ్మ, కుటుంబీకులు రమణమ్మ, వెంగమ్మ, సుబ్బమ్మపై దాడికి యత్నించారని తెలిపారు. 


రాష్ట్రపతి పాలన అవసరం 

ఏపీలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభు త్వం రాష్ట్రపతి పాలన విధించాలని శ్రీనివాసులు రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తానిచ్చిన ఫిర్యాదులను గవర్నర్‌ పరిగణలోకి తీసుకుని కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు. ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా విదేశాంగ శాఖలో పని చేస్తున్న తనకే ఈ రాష్ట్రంలో న్యాయం జరగకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరం గా ఉందన్నారు. తన ఇంటిని ఈ నెల 9వ తేదీన ధ్వంసం చేస్తే 10న నెల్లూరు రూరల్‌ పోలీసులకు తన తల్లి ఫిర్యాదు ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టలేకపోవడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉండటమే కారణమన్నారు. రాజ్యాంగాన్ని సైతం సంక్షోభంలో నెట్టేసే పరిస్థితులు ఇప్పుడు ఏపీలో దాపరించాయన్నారు. 


సెక్షన్లన్నీ తారుమారు 

తమపై దాడి, ఆస్తుల ధ్వంసం, మహిళలపై దౌర్జన్యానికి పాల్పడినట్లు తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇందుకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయని రూరల్‌ పోలీసులు కేవలం స్టేషన్‌ బెయిల్‌ వచ్చే అత్యంతం సులువైన సెక్షన్లను నమోదు చేసి చేతులు దులుపుకున్నారని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు ఏదీ చెబితే ఆ విధంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే విధానం ఏపీలోనే ఉందన్నారు. అధికారులు స్వతంత్య్రంగా, స్వేచ్ఛగా పని చేసే అవకాశం లేకుండా పోయిందని, 


మేము తిరిగి దాడిచేస్తే..?

తమపై జరిగిన దాడి, దౌర్జన్యంపై ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు, తాము ఇదే  తరహాలో దాడులకు పాల్పడినా కూడా ఇలాగే మిన్నకుండిపోతారా....? అని ఐఎఫ్‌ఎస్‌ అధికారి కుటుంబీకురాలు గోరు వెంగమ్మ ప్రశ్నించారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వాళ్లకు నచ్చినట్లు రాసుకున్నారని, ఇదెక్కడి ప్రభుత్వమంటూ మండిపడ్డారు. తమకు పోలీసులు న్యాయం చేయకపోతే తమపై దౌర్జన్యానికి దిగిన వారిపై తిరిగి దాడులకు పాల్పడవలసి వస్తుందని హెచ్చరించారు. 

Updated Date - 2021-09-19T05:39:59+05:30 IST