కరోనా పట్ల నిర్లక్ష్యం పనికిరాదు

ABN , First Publish Date - 2021-04-23T05:01:45+05:30 IST

కరోనా వ్యాప్తి పట్ల నిర్లక్ష్యం పనికి రాద ని మండల వైద్యాధి కారి డాక్టర్‌ వాసుదే వరెడ్డి గ్రామీణ ప్రాంత ప్రజలకు సూచించారు.

కరోనా పట్ల నిర్లక్ష్యం పనికిరాదు
జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న డాక్టర్‌ వాసుదేవరెడ్డి

గోపవరం, ఏప్రిల్‌ 22: కరోనా వ్యాప్తి పట్ల నిర్లక్ష్యం పనికి రాద ని మండల వైద్యాధి కారి డాక్టర్‌ వాసుదే వరెడ్డి గ్రామీణ ప్రాంత ప్రజలకు సూచించారు. బెడు సుపల్లెలో జ్వరాలు, జలుబు, నొప్పులతో బాధ పడుతుండడంతో మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఇంట్లో సభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి వైద్యసేవ లందించారు. కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఉపాధి పనులకు వెళ్లి ఎండ బెట్ట బారిన పడడంతో వచ్చిన జ్వరాలన్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రభావం గ్రామాలపై పడుతుందని, ఈ వ్యాధి పట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీహెచఓగౌస్‌, సుబ్బారెడ్డి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-23T05:01:45+05:30 IST