ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌ 80 శాతం పూర్తి

ABN , First Publish Date - 2021-11-30T05:42:33+05:30 IST

ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌ 80 శాతం పూర్తి

ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌ 80 శాతం పూర్తి
కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు

నూజివీడు టౌన్‌, నవంబరు 29 : రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ 80శాతం పూర్తయింది. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో మొత్తం 4వేల సీట్లకు గానూ ఆరోరోజు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికి కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ (సీ), బీసీ (ఈ) కేటగిరీలలో మాత్రమే సీట్లు భర్తీ కావాల్సి ఉంది. ఆరోరోజు అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక బీసీ (సీ) కింద నూజివీడు మినహా మిగిలిన క్యాంపస్‌లలో 22 సీట్లు, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో బీసీ (ఈ) కేటగిరీలలో 32 సీట్లు, నాలుగు క్యాంపస్‌లలో ఎస్సీ కేటగిరీలో 331, ఎస్టీ కేటగిరీలో 181 సీట్లు ఖాళీగా ఉన్నాయి. పైన పేర్కొన్న క్యాంపస్‌ల ప్రకారం ఈ కేటగిరీలలో ఉన్న అభ్యర్థులు వారి కాల్‌ లెటర్‌లలో పేర్కొన్న షెడ్యుల్‌ ప్రకారమే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని అడ్మిషన్ల కన్వీనర్‌ గోపాలరాజు సూచించారు. 

Updated Date - 2021-11-30T05:42:33+05:30 IST