ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-28T06:02:32+05:30 IST

ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి సంబంధించి ఆర్జీయూకేటీ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ మంగళ వారం ప్రారంభమైంది.

ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌ ప్రారంభం

నూజివీడు టౌన్‌, సెప్టెంబరు 27: ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి సంబంధించి ఆర్జీయూకేటీ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ మంగళ వారం ప్రారంభమైంది. 27 నుంచి 30 వరకు స్పెషల్‌ కేటగిరీలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంది. ఆచార్య జీవీఆర్‌ శ్రీనివాసరావు, నిర్దేశకులు ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్‌లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. మొదటిరోజు స్పోర్ట్స్‌ కేటగిరీలో 256 మంది, క్యాప్‌ కేటగిరిలో 170 మంది హాజరయ్యారు. విద్యార్థులు వారికి కేటాయిం చిన తేదీల్లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరు కాలేని పక్షంలో కింద పేర్కొన్న ఇతర తేదీల్లో కేడర్‌ వారీగా హాజరుకావచ్చు. ఈనెల 28,29,30 తేదీల్లో స్పోర్ట్స్‌ కేటగిరీ , ఎన్‌సీసీ కేటగిరీకి సంబంధించిన వారు, 28న క్యాప్‌ కేటగిరీ, పీహెచ్‌సీ (దివ్యాంగుల కోటా) సంబంధించిన వారు, 29న బీఎస్‌జీ కేటగిరీకి సంబంధించిన వారు హాజరుకావచ్చునని ఆర్జీయూకేటీ అడ్మిషన్స్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోపాలరాజు తెలిపారు.


Updated Date - 2022-09-28T06:02:32+05:30 IST