‘సమాజంలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్‌లు, జడ్జీలు, సైంటిస్టులు, నేతలకు కొరత లేదు’ అంటూ ఆ ఐఐటీ గోల్డ్ మెడలిస్ట్ తీసుకున్న నిర్ణయమిదే!

ABN , First Publish Date - 2022-10-02T14:38:50+05:30 IST

ఐఐటీ ఢిల్లీలో బీటెక్ పూర్తిచేసిన ఇంజినీరింగ్ గోల్డ్ మెడలిస్ట్...

‘సమాజంలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్‌లు, జడ్జీలు, సైంటిస్టులు, నేతలకు కొరత లేదు’ అంటూ ఆ ఐఐటీ గోల్డ్ మెడలిస్ట్ తీసుకున్న నిర్ణయమిదే!

ఐఐటీ ఢిల్లీలో బీటెక్ పూర్తిచేసిన ఇంజినీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ సన్యాసిగా మారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంటెక్ చేసి, భారీ జీతంతో ఉద్యోగం కూడా చేసి, 28 ఏళ్లకే అతను పదవీ విరమణ బాట పట్టారు. ఐఐటీ ఢిల్లీకి చెందిన గోల్డ్ మెడలిస్ట్ సందీప్ కుమార్ భట్ సన్యాసిగా మారారు. అతనికి పెళ్లి కూడా కాలేదు. అతను సన్యాసిగా మారాక స్వామి సుందర్ గోపాల్ దాస్‌గా మారారు. బీహార్‌కు చెందిన సందీప్ కుమార్ 2002లో ఢిల్లీ ఐఐటీ నుంచి బీటెక్ పూర్తి చేయడంతోపాటు బంగారు పతకాన్ని సాధించారు. 2004లో ఎంటెక్‌ పూర్తి చేశారు. 2004 నుండి 2007 వరకు లార్సెన్ & టూబ్రోలో మేనేజర్‌గా పనిచేశారు. 2007లో సన్యాసం స్వీకరించారు.  



'విద్యావంతులు సాధువులుగా, మారాలి' అనే సందేశమిచ్చిన సందీప్ భట్ మాట్లాడుతూ మెషీన్ నాణ్యత పెరుగుతోందని, అయితే మనిషి నాణ్యత మాత్రం తగ్గుతోందని అన్నారు. ఏటా లక్షల సంఖ్యలో నేరాలు నమోదవుతున్నాయి. మనిషి నాణ్యత దిగజారుతోండనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు ఎందరో ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్‌లు, జడ్జీలు, సైంటిస్టులు, నాయకులు ఉండడం గమనించానని, కానీ సమాజానికి భిన్నమైన మార్గాన్ని చూపగల వ్యక్తి ఎవరూ లేరన్నారు. ప్రజల స్వభావాన్ని సరిదిద్దడానికి సన్యాసిగా మారానన్నారు. ప్రజలు భౌతిక సుఖాల కోసం వెతుకుతున్నారని, మనుషులలోని తప్పుడు అలవాట్లన్నీ పోవాలంటే మతపరమైన విద్య అవసరమన్నారు. మనిషిగా ఎలా ఉండాలో చాలామందికి తెలియడం లేదన్నారు. ప్రజలలో స్వీయ నియంత్రణ కొరవడిందన్నారు. నోబెల్ బహుమతి పొందడం పెద్ద విషయం కాదని, చెడిపోయిన వ్యక్తిని బాగుపరచడమే నిజంగా పెద్ద పని అని సందీప్ కుమార్ తెలిపారు. సందీప్ సన్యాసి అవుతాడని కుటుంబ సభ్యులకు తెలియగానే, వారు కొంత ఆందోళన చెందారు. అయితే వారిని సందీప్ ఒప్పించాడు. ఐఐటీ ఢిల్లీలో ఉన్నప్పుడు సందీప్ భగవద్గీత చదివారు. అదే తన జీవితంలో పెద్ద మార్పు తెచ్చిందని సందీప్ చెబుతుండారు. 

Updated Date - 2022-10-02T14:38:50+05:30 IST