డిజిటల్‌ పేమెంట్స్‌కు ఐఐటీ మద్రాస్‌ సాంకేతికత

ABN , First Publish Date - 2021-05-15T05:30:00+05:30 IST

డిజిటల్‌ పేమెంట్స్‌కు వాయిస్‌ ఆధారిత సేవలు జోడించేందుకు సరికొత్త సాంకేతికతను ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు అభివృద్ధిపరుస్తున్నారు

డిజిటల్‌ పేమెంట్స్‌కు ఐఐటీ మద్రాస్‌ సాంకేతికత

డిజిటల్‌ పేమెంట్స్‌కు వాయిస్‌ ఆధారిత సేవలు జోడించేందుకు సరికొత్త సాంకేతికతను ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు అభివృద్ధిపరుస్తున్నారు. మొబైల్‌ పేమెంట్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఇండియా(ఎంపీఎఫ్‌ఐ)తో ఇందుకోసం చేతులు కలిపింది. వంద మిలియన్లుగా ప్రస్తుతం ఉన్న ఈ లావాదేవీలను 2025నాటికి ఐదు రెట్లు అంటే అయిదు వందల మిలియన్లకు చేర్చాలన్న లక్ష్యంతో ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు కృషి చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లో వాయిస్‌  ఆధారిత పేమెంట్‌ సేవలను అందించే ప్రయత్నం జరుగుతోంది. మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతో పరిశోధన కొనసాగుతోంది. డిజిటల్‌ పేమెంట్‌ ప్రక్రియ మరింత పకడ్బందీగా జరిగేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని ఈ సందర్భంలో మద్రాస్‌ ఐఐటీ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి గౌరవ్‌ రైనా తెలిపారు.

Updated Date - 2021-05-15T05:30:00+05:30 IST