కరోనాపై పోరాటానికి రూర్కీ ఐఐటీ చేయూత

ABN , First Publish Date - 2021-05-11T18:17:59+05:30 IST

కరోనాపై పోరాటానికి రూర్కీ ఐఐటీ చేయూతనిస్తోంది....

కరోనాపై పోరాటానికి రూర్కీ ఐఐటీ చేయూత

రూర్కీ (ఉత్తరాఖండ్): కరోనాపై పోరాటానికి రూర్కీ ఐఐటీ చేయూతనిస్తోంది. రూర్కీ ఐఐటీ తమ వద్ద ఉన్న ఆక్సిజన్ సిలిండర్లను సివిల్ ఆసుపత్రికి బదిలీ చేసింది. రూర్కీ ఐఐటీ క్యాంపస్ లో కరోనా రోగుల చికిత్స కోసం కొవిడ్ కేర్ సెంటరును ఏర్పాటు చేసింది. దీంతోపాటు ఐఐటీ క్యాంపస్ లో కొవిడ్ టీకా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. కరోనా వ్యాప్తితో విద్యార్థులను వారి ఇళ్లకు పంపించివేసి కరోనా రోగుల చికిత్స కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి రూర్కీ ఐఐటీ ముందుకు వచ్చింది. తమ క్యాంపస్ లో ఉన్న 65 ఆక్సిజన్ సిలిండర్లను సివిల్ ఆసుపత్రికి పంపించారు.


 రూర్కీ ఐఐటీ చేసిన సాయం వల్ల ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదని రూర్కీ సివిల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంజయ్ కన్సల్ చెప్పారు. ఐఐటీ క్యాంపస్ లోని గంగా భవన్ లో 150 పడకల సామర్ధ్యంతో కొవిడ్ కేర్ సెంటరును ఏర్పాటు చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున తమ బాధ్యతగా తాము చేయూతనిస్తున్నామని రూర్కీ ఐఐటీ డైరెక్టరు ప్రొఫెసరు అజిత్ కె. చతుర్వేది చెప్పారు.

Updated Date - 2021-05-11T18:17:59+05:30 IST