రాత్రి 11 గంటలకు ఓ ఇంట్లోంచి అదే పనిగా అరుస్తున్న కుక్క.. చిరాకొచ్చి గొడవకు వెళ్లిన స్థానికులు.. ఎవరూ పలకకపోవడంతో కిటికీలోంచి చూస్తే..

ABN , First Publish Date - 2021-10-22T18:57:29+05:30 IST

ఆ కాలనీలోని వారంతా రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ప్రశాంతంగా బెడ్ మీదకు వెళ్లిన వారికి అపుడే ఓ ఇంట్లోంచి కుక్క అరుపులు వినిపించాయి. ఎవరైనా కొత్త వాళ్లు వచ్చారేమో.. అందుకే అలా అరుస్తుందేమోనని

రాత్రి 11 గంటలకు ఓ ఇంట్లోంచి అదే పనిగా అరుస్తున్న కుక్క.. చిరాకొచ్చి గొడవకు వెళ్లిన స్థానికులు.. ఎవరూ పలకకపోవడంతో కిటికీలోంచి చూస్తే..

భోపాల్: ఆ కాలనీలోని వారంతా రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ప్రశాంతంగా బెడ్ మీదకు వెళ్లిన వారికి అపుడే ఓ ఇంట్లోంచి కుక్క అరుపులు వినిపించాయి. ఎవరైనా కొత్త వాళ్లు వచ్చారేమో.. అందుకే అలా అరుస్తుందేమోనని స్థానికులు భావించారు. కానీ కుక్క అదే పనిగా అరుస్తూనే ఉంది. నిద్రకు భంగం కలగడంతో అప్పటివరకు ఓపిక పట్టిన స్థానికులకు చిరాకొచ్చింది. కోపంతో ఆ కుక్క ఉన్న ఇంటికి గొడవకు వెళ్లారు. ఎంత పిలిచినా అక్కడ ఎవరూ పలకకపోవడంతో తెరిచి ఉన్న కిటికీలోంచి గదిలోకి చూశారు. అక్కడ కనిపించిన సీన్ చూసి వారు నివ్వెరపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకెళ్తే..


ఇండోర్‌లోని నర్మదా వ్యాలీ డెవలప్‌మెంట్ అథారిటీ కాలనీకి చెందిన అడిషనల్ డైరెక్టర్ విజిత్ కుమార్ విజయవత్ కొడుకు సార్థక్ ఖరగ్‌పూర్‌లో ఐఐటి చదువుతున్నాడు. బుధవారం రాత్రి సార్థక్ సోదరుడు వాత్సల్య ఐటి కోచింగ్ వెళ్లాడు. తల్లి పనిమీద అహ్మదాబాద్ వెళ్లింది. తండ్రి విధులకు వెళ్లడంతో ఒంటరిగా ఇంట్లో ఉన్న సార్థక్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సార్థక్‌ని విగతజీవిగా చూసి వారి పెంపుడు కుక్క అరవడం ప్రారంభించింది. అదేపనిగా అరుస్తున్న కుక్కపై చిర్రెత్తుకొచ్చిన స్థానికులు గొడవకు వచ్చారు. ఇంట్లోని వారిని ఎంత పిలిచినా పలకలేదు. తెరిచి ఉన్న కిటికీలోంచి చూస్తే గదిలో సార్థక్ శవం వేలాడుతూ కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.


అక్కడ పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో సార్థక్ ఏం రాశాడంటే.. ‘‘ఎన్నో ఆశలతో నేను జేఈఈకి ప్రిపేర్ అయ్యాను. క్యాంపస్‌లో కోచింగ్ తీసుకుని బాగా చదువాలని అనుకున్నా... కానీ ఆన్‌లైన్ క్లాస్‌ల వల్ల ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అమ్మా, నాన్నా.. మీకు చాలా పట్టుదల ఉంటుంది. మీరు మీ తోబుట్టువులతో మాట్లాడినంత చనువుగా నాతో, తమ్ముడితో మాట్లాడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు మాతో ఎక్కువ సమయం గడిపేవారు. నాకు ఎవరి మీద కోపం లేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు. నేను క్యాంపస్ సెలక్షన్‌కు సంబంధించిన డిప్రెషన్‌లో ఉన్నాను. అదే సమయంలో నాకు ఒంటరితనం కూడా తోడైంది. నాకు కుటుంబంతో కలిసి ఇండోర్‌లోనే ఉండాలనిపించింది. కానీ నా చదువుల కారణంగా అక్కడి నుంచి రావాల్సి వచ్చింది’’ అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా చదువు విషయంలో తండ్రి కూడా ఒత్తిడి చేశాడని సార్థక్ తెలిపాడు. చివర్లో ‘నేను వెళ్లిపోతున్నాను (ఐ క్విట్)’ అని రాశాడు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామన్నారు. 


Updated Date - 2021-10-22T18:57:29+05:30 IST