భారతీయులను వెనక్కి తెచ్చే ఏ ప్రయత్నాన్నీ వదలం: మోదీ

ABN , First Publish Date - 2022-03-02T21:25:51+05:30 IST

యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని..

భారతీయులను వెనక్కి తెచ్చే ఏ ప్రయత్నాన్నీ వదలం: మోదీ

న్యూఢిల్లీ: యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలి పెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోన్‌భద్ర జిల్లాలో బుధవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తెస్తున్నామని చెప్పారు. వేలాది మందిని ఇప్పటికే భారత్‌తు తీసుకువచ్చామని చెప్పారు. తాము చేపట్టిన ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు నలుగురు మంత్రులను కూడా అక్కడకు పంపామని, భారతీయులను సురక్షితంగా తెచ్చేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదలిపెట్టేది లేదని అన్నారు. ఇండియా బలం పెరుగుతున్నందున్నే మనం ఇలాంటి సురక్షిత చర్చలు తీసుకోగలుగుతున్నామని అన్నారు. కాగా, ఈనెల 7వ తేదీన జరిగే తుది విడత పోలింగ్‌లో సోన్‌భద్ర జిల్లా కూడా ఉంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించనున్నారు.

Updated Date - 2022-03-02T21:25:51+05:30 IST