మొరం అక్రమార్కుల వరం

ABN , First Publish Date - 2020-10-05T10:19:40+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొరం దందా యథేచ్ఛ గా సాగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో నిర్మా ణ పనులు

మొరం అక్రమార్కుల వరం

ఉమ్మడి జిల్లాలో అక్రమంగా మొరం తవ్వకాలు

అనుమతి ఒకచోట.. తవ్వకాలు మరోచోట!

గుట్టలను మాయం చేస్తున్న అక్రమార్కులు

అటవీ, ప్రభుత్వ భూముల్లోని గుట్టలే టార్గెట్‌

గాంధారిలో ఓ మాజీ ప్రజాప్రతినిధి దందా

గుట్టలు కనిపించిన చోటల్లా వాలిపోతున్న నేత

బ్రాహ్మణపల్లిలో ప్రైవేట్‌ గోదాంకు తరలింపు టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు

అక్రమ తవ్వకాలతో కరిగిపోతున్న ప్రకృతి సంపద

చోద్యం చూస్తున్న ఉభయ జిల్లాల అధికారులు


కామారెడ్డి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొరం దందా యథేచ్ఛ గా సాగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండడంతో కొందరు అక్రమా ర్కులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కాంట్రాక్టర్ల ముసుగులో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ కోట్ల కు పగడలెత్తుతున్నారు. అటవీ, ప్రభుత్వ, అసైన్డ్‌మెంట్‌, ప ట్టాభూముల్లో కనిపించిన చోటల్లా గుట్టలను మాయం చే స్తున్నారు. ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టిని చెల్లించకుండా గుట్టుగా మొరంను తరలించేస్తూ సొమ్ము చేసుకుంటున్నా రు. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


మొరానికి పెరిగిన డిమాండ్‌

ప్రస్తుతం ఇసుకకు ఉ న్న డిమాండ్‌ మొరంనకు సైతం ఉండడంతో కొంద రు అక్రమార్కులు ఈ మొరం దందాకు తెర లే పుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని రూరల్‌, మోపాల్‌, సారంగపూర్‌, మం చిప్ప, గుండారం, నాగారం తదిత ర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లోని గుట్టలను అక్రమార్కులు విచ్చలవిడిగా త వ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో తా డ్వాయి, గాంఽధారి, సదాశివనగర్‌, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, మద్నూర్‌, పిట్లం, పెద్దకొడప్‌గల్‌, భిక్కనూర్‌, రాజంపేట త దితర మండలాల్లోనూ మొరం దందా కొనసాగుతోంది. అ నుమతులు లేకుండానే మొరం దందాను కొనసాగిస్తున్నా రు. ఒకవేళ అధికారుల వద్ద అనుమతి తీసుకున్నా.. తమకు చూపించిన హద్దులను దాటి మరీ తవ్వకాలను జరుపుతు న్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, క్షేత్రస్థాయి సి బ్బంది చూసీచూడనట్లుగా వదిలేస్తుండడంతో గుట్టలు సై తం కరిగిపోతున్నాయి.


మాజీ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలోనే దందా  

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలో గాంధా రి మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి కనిపించిన గుట్టలను మాయం చేస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. సదరు నేతకు అధికార పార్టీ నేతల అండదండలు, కొందరు రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల ప్రో త్సాహం, కుటుంబ సభ్యులు, రెవెన్యూ శాఖలో ఉండడం తో యథేచ్ఛగా దందా కొన సాగిస్తున్నట్టు తెలుస్తోంది. గాంఽధారి, సదాశివనగర్‌, తా డ్వాయి, లింగంపేట తదితర మండలాల పరిధిలోని పట్టా భూముల్లోనే కాకుండా ప్రభుత్వ, చివరికి అటవీ భూములలోని గుట్ట లను కూడా వదలడం లేదనే విమర్శలు న్నాయి. సదరు నేత మొరం తవ్వకాలకే ప్రత్యే కంగా రెండు జేసీబీలతో పాటు ఆరు టిప్పర్‌లను సమకూ ర్చుకొని గుట్టలు కనిపిస్తే చాలు అక్కడ వీటిని దింపి గుట్టు గా తవ్వకాలు జరుపు తున్నాడని ఆరోపణలున్నాయి. ఏడాది కిందట సదాశివనగర్‌ మండల పరిధిలో జాతీయ రహదారి సమీపంలోని ప్రభుత్వ భూముల్లో గల ఓ గుట్టలోని మొరం ను తవ్వేసి స్థానికంగా చేపట్టే అక్రమ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకున్నాడనే విమర్శలున్నాయి. ఆ సమయంలో అధికారులు దాడులు చేసి జేసీబీ, టిప్పర్‌ను సీజ్‌ చేసినప్ప టికీ మరుసటి రోజే అధికార పార్టీ నేతల ఒత్తిడితో వాటిని వదిలి పెట్టారు. ఆ తర్వాత కూడా సదరు నేత అక్రమ మొ రం దందాను మాత్రం మానుకోలేదు.


ప్రైవేట్‌ గోదాంకు 20 వేల ట్రిప్పుల ఒప్పందం

తాడ్వాయి మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి శివారులో ప్రైవేట్‌ వ్యక్తులు భారీ గోదాంను నిర్మిస్తున్నారు. ఈ గోదాం కు 20 వేల ట్రిప్పుల మొరం తరలించేందుకు ప్రైవేట్‌ వ్యక్తు లతో సదరు నేత ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం తాడ్వాయి మండల కేంద్రంలోని ఓ గుట్టపై, సంగోజివాడి గ్రామ శివారులోని మరో గుట్టపై ఆయన కన్నేశాడు. స్థానిక రెవెన్యూ, మైనింగ్‌ శాఖ అధికారులతో కొద్దిపాటి తవ్వకాలకు అనుమతి తీసుకొని అనుమతికి మించి తవ్వకాలు జరుపు తున్నాడని ఆరోపణలున్నాయి. అనుమతి ఒకచోట తీసుకుని గుట్టలో మరోచోట తవ్వకాలు జరుపుతూ అక్రమంగా మొ రంను తరలిస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. 20 వే ల ట్రిప్పుల మొరం తరలింపునకు ఏ ప్రభుత్వశాఖ కూడా ఒకేసారి అనుమతి ఇవ్వదు. అలాంటిది సదరు నేత ప్రైవేట్‌ గోదాంకు 20 వేల ట్రిప్పుల మొరం తరలింపునకు ఎలా ఒ ప్పందం కుదుర్చుకున్నాడో అర్థం కావడం లేదు. బ్రాహ్మణప ల్లి గ్రామం మీదుగా నిత్యం పదుల సంఖ్యలో భారీ టిప్పర్‌ల తో మొరాన్ని తరలిస్తుండడంతో ఆదివారం ఆ గ్రామస్థులు టిప్పర్లను అడ్డుకున్నారు. టిప్పర్‌ల రాకపోకలతో గ్రామంలో ని రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని, దీనికి భాద్యులు ఎ వరని స్థానిక గ్రామస్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. 


చూసీచూడనట్లుగా అధికారులు

ఉమ్మడి జిల్లాలో ఇసుకతో పాటు మొరం అక్రమ తవ్వకా లు యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధి కారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం, క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది ‘మామూలు’గా వదిలేయడంతో ప్రకృతి సం పద కరిగిపోతోంది. కొంతమంది కిందిస్థాయి అధికారులు, సిబ్బంది మొరం లేకుండా నిర్మాణాలు ఎలా కడతారంటూ ఉల్టా ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాలు, గ్రామాల్లో మొరం తవ్వకాలు కొనసా             గుతున్నాయి. విషయం తెలిసినా.. కొంతమంది అధికా రులు ఎంతో కొంత తీసుకుని వారి ఇష్టానుసారానికి వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇసుకతో పాటు మొరం తవ్వకాలు జరుపుతున్న వారిలో రాజకీయ అండ ఉన్నవారే ఎక్కువగా ఉండడంతో అధికారులు చేతులు ఎత్తేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.


అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..సాయి భుజంగరావు, తహసీల్దార్‌, తాడ్వాయి

ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న చోట మాత్రమే మొరం తవ్వకాలు చేపట్టాలి. అనుమతి ఒకచోట తీసుకొని.. మరో చోట నిబంధనలకు వ్యతిరేకంగా తవ్వకాలు జరపకూ డదు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీ సుకుంటాం. వాహనాలను జప్పు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తాం. ఘటనా స్థలిని పరిశీలించి నిబంధనల మే రకు తవ్వకాలు జరపకుంటే తక్షణమే నిలిపివేస్తాం.

Updated Date - 2020-10-05T10:19:40+05:30 IST