Illegal mining.. విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్: చదలవాడ

ABN , First Publish Date - 2022-08-14T19:21:14+05:30 IST

నరసరావుపేట నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా కొనసాగుతోందని చదలవాడ ఆరోపించారు.

Illegal mining.. విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ మైనింగ్: చదలవాడ

పల్నాడు జిల్లా (Palnadu District): నరసరావుపేట నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ (illegal mining) విచ్చలవిడిగా కొనసాగుతోందని టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవింద్ బాబు (Arvind Babu) అన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌పై జిల్లా కలెక్టర్‌ (Collector)కు గతంలో ఫిర్యాదు చేశానన్నారు. అయినా అక్రమ మైనింగ్ ఆగడంలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి (MLA Gopireddy) అండతోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. అక్రమ మైనింగ్ తక్షణమే ఆపకపోతే టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చదలవాడ అరవింద్ బాబు హెచ్చరించారు.

Updated Date - 2022-08-14T19:21:14+05:30 IST