కుందూనదిలో భారీగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు

ABN , First Publish Date - 2022-06-30T23:11:18+05:30 IST

కడప: కుందూనది విస్తరణ పనుల్లో వైసీపీ శ్రేణులు భారీగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను పాల్పడుతున్నాయి. కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు లింగా‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణ

కుందూనదిలో భారీగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు

కడప: కుందూనది విస్తరణ పనుల్లో వైసీపీ శ్రేణులు భారీగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలను పాల్పడుతున్నాయి. కడప పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు లింగా‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, పొద్దుటూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్ జనార్దన్ కుందూనదీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఈ సందర్భంగా టీటీడీ మాజీ చైర్మన్, టీడీపీ మైదుకూరు ఇన్‌చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘కుందూనదిలో యధేచ్చగా ఇసుక, మట్టి దోపిడీ సాగుతోంది.. వైసీపీ పెద్దల అండదండలతో ఇసుక మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయి. కుందూనదిపై ఆధారపడి రైతులు వేలఎకరాలు సాగుచేస్తున్నారు. రూ. 2 వేల కోట్లతో నది విస్తరణ పనులకు టెండర్లు పిలిచారు. జోలవిరాశీలో 1టీఎంసీ, రాజోలి ఆనకట్ట నిర్మాణాలను కూడా టెండర్లలో చేర్చారు. 7 కోట్ల పది లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడిక తీత పనులు చేయాలి. ముందు ఆనకట్ట పనులు చేయకుండా.. పూడిక తీత పనులు చేస్తున్నారు. తొలగించిన మట్టిని, ఇసుకను అధికార పార్టీ నేతలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తొలగించిన మట్టిని అమ్మే హక్కు ఎవరికి లేదు. మట్టి, ఇసుక తరలిస్తే దానికి ఇంజనీర్లదే భాద్యత. టీడీపీ అధికారంలోకి రాగానే జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తాం.

Updated Date - 2022-06-30T23:11:18+05:30 IST