అక్రమ నిర్మాణాలు నిలువరింత

ABN , First Publish Date - 2022-01-22T05:13:06+05:30 IST

కందులాపురం పంచాయతీ పరిధిలోని అరాఫత్‌నగర్‌లో అక్రమ కట్టడాలను వెంటనే ఆపాలని ఆప్రాంతవాసులు తహసీల్దార్‌ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన ఆర్‌ఐ, వీఆర్‌వోలను పంపి అక్రమ కట్టడాలను నిలిపివేయించారు. కంభం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని ప్రహరీగోడ వెనుక ఉన్న 133/11 కేవీ టవర్‌ను ఆనుకుని అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను వెంటనే ఆపివేయించాలని, సర్వే నెంబరు 149లో రోడ్డు ఆక్రమించి నిర్మించిన కాంపౌండ్‌ను తొలగించాలని ఆరాఫత్‌నగర వాసులు, గిద్దలూరు నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి షేక్‌ మహమ్మద్‌ ఇబ్రహీం తహసీల్దార్‌కు వినతిపత్రం అందచేసి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

అక్రమ నిర్మాణాలు నిలువరింత
అక్రమ కట్టడాలను ఆపుతున్న ఆర్‌ఐ, వీఆర్‌వోలు

కంభం, జనవరి 21 : కందులాపురం పంచాయతీ పరిధిలోని అరాఫత్‌నగర్‌లో అక్రమ కట్టడాలను వెంటనే ఆపాలని ఆప్రాంతవాసులు తహసీల్దార్‌ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన ఆర్‌ఐ, వీఆర్‌వోలను పంపి అక్రమ కట్టడాలను నిలిపివేయించారు.  కంభం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని ప్రహరీగోడ వెనుక ఉన్న 133/11 కేవీ టవర్‌ను ఆనుకుని అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను వెంటనే ఆపివేయించాలని, సర్వే నెంబరు 149లో రోడ్డు ఆక్రమించి నిర్మించిన కాంపౌండ్‌ను తొలగించాలని ఆరాఫత్‌నగర వాసులు, గిద్దలూరు నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి షేక్‌ మహమ్మద్‌ ఇబ్రహీం తహసీల్దార్‌కు వినతిపత్రం అందచేసి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వెంటనే స్పందించిన తహసీల్దార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, వీఆర్వో అనూషలను పంపి అక్రమ కట్టడాలను ఆపివేయించారు. 


Updated Date - 2022-01-22T05:13:06+05:30 IST