అభయారణ్య పరిధిలో అక్రమ తవ్వకాలు

ABN , First Publish Date - 2022-06-28T06:15:05+05:30 IST

కొల్లేరు అభయా రణ్య పరిధిలో చేపలచెరువు అక్రమ తవ్వకాలను అటవీ శాఖ అధికారులు సోమవారం అడ్డుకుని గట్లను ధ్వంసం చేశారు.

అభయారణ్య పరిధిలో అక్రమ తవ్వకాలు
చేపల చెరువు గట్లను ధ్వంసం చేస్తున్న అటవీ అధికారులు

ఎక్స్‌కవేటర్‌ సీజ్‌..  నలుగురిపై కేసు  

కైకలూరు, జూన్‌ 27: కొల్లేరు అభయా రణ్య  పరిధిలో చేపలచెరువు అక్రమ తవ్వకాలను అటవీ శాఖ అధికారులు సోమవారం అడ్డుకుని గట్లను ధ్వంసం చేశారు. కైకలూరు మండలం చటాకాయ గ్రామంలో రాత్రి సమయంలో కొల్లేరు అభయారణ్య పరిధిలో చేపల చెరువు తవ్వకాలు నిర్వహిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు అటవీశాఖ డిప్యూటీ రేంజర్‌ జయప్రకాష్‌ తనిఖీలు నిర్వహించగా అభయారణ్య పరిధిలో సుమారు 30 ఎకరాల చేపల చెరువు గట్ల నిర్మాణాన్ని చేపట్టారని, దీనిపై విచారణ జరిపి సంఘటనా స్థలంలోని ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌చేసి నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడితే కేసులు నమోదు  చేస్తామని హెచ్చరించారు.  చటాకాయలో తవ్విన గట్లను పూర్తిగా ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-06-28T06:15:05+05:30 IST