అక్రమంగా మట్టి తోలకాన్ని అడ్డుకున్న గ్రామస్తులు

ABN , First Publish Date - 2021-04-24T04:23:24+05:30 IST

అక్రమంగా మట్టి తోలకాన్ని శ్రీనివాసపురం గ్రామస్తులు అడ్డుకున్నారు.

అక్రమంగా మట్టి తోలకాన్ని   అడ్డుకున్న గ్రామస్తులు
జేసీబీతో మట్టిని టిప్పర్లకు లోడ్‌ చేస్తున్న దృశ్యం

గోపవరం, ఏప్రిల్‌ 23: అక్రమంగా మట్టి తోలకాన్ని శ్రీనివాసపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. మండల పరిధిలో అక్రమ మట్టి తోలకాలు పేట్రేగిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదంటూ గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. శుక్రవారం శ్రీనివాసపురం పరిసర గ్రామాల్లో టిప్పర్ల ద్వారా మట్టి తోలుతుండగా గుర్తించిన గ్రామస్తులు అడ్డుకున్నారు.

ఈ ప్రాంతంలోని మట్టినంతా ఇతర ప్రాంతాలకు అమ్మితూ పోతే స్థానికులకు అవసరమైతే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు తీసుకుని మట్టి తోలుకోవాలని, ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలు పెట్టి టిప్పర్ల ద్వారా మట్టి తోలుతుంటే అధికారులు పట్టించుకోకపోవడమేంటంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

మట్టి తరలింపు విషయం అధికారుల దృష్టికి తేవడంతో ఆర్‌ఐ సత్యమూర్తి ఆధ్వర్యంలో పనులు నిలిపి వాహనాలు అక్కడి నుంచి పంపించివేశారు. మొత్తమ్మీద గోపవరం మండలంలో ఎక్కడ పడినా అక్రమార్కుల దే హవా సాగుతుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-04-24T04:23:24+05:30 IST