
యథేచ్ఛగా బండరాళ్లు, మొరం తరలింపు
అధికారులు అడ్డుకుంటున్నా...ఆగని అక్రమం
రూ. లక్షల విలువ గల సంపద దోపిడీ
జగిత్యాల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): అక్రమార్కులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువను సైతం వదలడం లేదు. అక్రమంగా టిప్పర్లు, లారీల ద్వారా బండరాళ్లను, మొరం, మట్టిని తరలిస్తున్నారు. ఇందుకు ప్ర త్యామ్నాయ దారులను ఏర్పాటు చేసుకుంటున్నారు. జేసీబీలతో రాళ్లను వాహనాల్లో నింపి సమీపంలోని క్వారీలకు తరలిస్తున్నారు. వరద కాలువ గట్టుకు ఉన్న బండరాళ్లను, మట్టిని తరలిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు పొంచి ఉన్నట్లవుతోంది. అధికారులు అడ్డుకున్నప్పటికీ అక్రమార్కుల ఆగ డాలు ఆగడం లేదు.
జిల్లాలో 60 కిలోమీటర్ల మేర వరదకాలువ...
జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ సుమారు 60 కిలో మీటర్ల మేరకు విస్తరించింది. నిజామాబాద్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఇబ్రహీంపట్నం మం డలంలో ప్రారంభమై మెట్పల్లి, కథలాపూర్, మేడిపల్లి, మల్యాల, పెగడ పల్లి, వెల్గటూరు మండలాల్లో సుమారు 60 కిలో మీటర్ల పొడవున వరద కాలువను నిర్మించారు. వరద కాలువ ద్వారా ఆయా గ్రామాల్లో సాగు నీ రు అందించేందుకు, నీటిని దిగువకు తరలించేందుకు నిర్మించారు. కాలు వ తవ్వకం సమయంలో వెలికి తీసిన మట్టి, పెద్ద పెద్ద బండ రాళ్లను కాలువకు ఇరువైపుల కట్ట మాదిరిగా నిర్మించారు. తద్వారా భవిష్యత్తులో వరదకాలువకు ప్రమాదం వాటిళ్లకుండా అధికారులు నిర్మించారు. భారీ ఎత్తున మట్టి, బండరాళ్లతో కట్ట నిర్మాణం జరిగింది.
బండరాళ్ల తరలింపుతో కాలువ బలహీనం
వరద కాలువకు ఇరువైపులా నిర్మించిన కట్ట నుంచి పెద్ద పెద్ద బండ రాళ్లను, మట్టిని, మొరంను పలువురు అక్రమార్కులు యథేచ్ఛగా తరలి స్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వరద కాలువ బండరాళ్ల తరలింపునకు అధికారులు అనుమతించరు. జిల్లాలోని ఎస్సారెస్పీ వరదకాలువ వెంబడి ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కథలాపూర్, మేడిపల్లి, మల్యాల తదితర మం డలాల్లో మొరం, బండరాళ్లను కొందరు అక్రమార్కులు ప్రొక్లెయిన్ల సహా యంతో లారీలు, టిప్పర్లలో తరలిస్తున్నారు. దీంతో పాటు మట్టిని సైతం ప్రమాదకరంగా గుంతుల తీసి ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. దీంతో వర ద కాలువ కట్ట బలహీనంగా తయారవుతోంది.
వరద కాలువ బండ రాళ్లతో దందా...
వదర కాలువకు పక్కన గల గట్లకు ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను, మట్టిని తరలించి ప్రైవేటుగా పలువురు దందా చేస్తున్నారు. బండరాళ్లను పగులగొట్టి టిప్పర్లు, లారీల ద్వారా తరలిస్తున్నారు. దీంతో కాలువ పక్కన పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కాలువ పక్కన గల గట్టు సైతం కూలే ప్రమాదం ఏర్పడింది. గతంలోనూ గట్టకు ఉన్న మట్టిని తీస్తుండగా ప్రమాదం జరిగి కూలీలు మృతి చెందిన సంఘట నలు సైతం ఉన్నాయి.
క్రషర్లకు తరలుతున్న బండరాయి...
జిల్లాలో కొంత మంది క్రషర్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వరద కాలువ వద్దనున్న బండరాళ్లను చిన్నసైజు చేసి టిప్పర్లద్వారా క్రష ర్లకు తరలిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా మ ట్టిని సైతం జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల వంటి పట్టణాలకు తరలించి అ క్రమ దందా కొనసాగిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో లారీలు, టిప్పర్ల ద్వారా బండరాళ్లను తరలిస్తున్నారు. రూ. లక్షల విలువ గల బండరాళ్లను తరలించి అక్రమంగా ఆదాయం ఆర్జిస్తున్నారు. అక్రమార్కులకు పలు గ్రా మాలకు చెందిన విలేజ్ డెవలప్మెంట్ కమిటీ(వీడీసీ)లు సహకారాలు అందుతున్నాయి.
దాడులు చేస్తున్నా...
జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్రాపూర్, సత్తక్కపల్లె ప్రాంతంలో అక్రమంగా బండరాళ్లను తరలిస్తున్న వ్యవహారాన్ని ఇటీవల మెట్పల్లి డివిజన్‌కు చెందిన అధికారులు గుర్తించారు. నిజామాబాద్ - జగిత్యాల సరిహద్దు ప్రాంతంలోని క్రషర్ యజమానితో పాటు మరికొం దరు తరలిస్తున్నట్లు గుర్తించి ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పలువురిపై కేసు నమోదైంది. ఇదే మాదిరిగా గతంలోనూ ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కథలాపూర్, మల్యాల తదితర ప్రాంతాల్లో అ ధికారులు అడ్డుకున్నప్పటికీ అక్రమదందా ఆగడం లేదు. అక్రమార్కులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతు న్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని రూ. లక్షల విలు వ గల వరద కాలువ సంపద దోపిడికి గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటున్నాంత
- వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ, మెట్పల్లి డివిజన్
వరద కాలువ పక్కన ఉన్న బండరాళ్లు, మట్టిని తీసేందుకు ఎలాంటి అనుమతులు ఉండవు. అక్రమ తరలింపును మా దృష్టికి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాము. కఠిన చర్యలు తీసుకుంటున్నాము. బండరాళ్లు, మొరం తరలిస్తున్న సమాచారం అందిస్తే నివారణకు చర్యలు తీసుకుంటాము.