Kuwait: ప్రభుత్వ రంగంలో నిరక్షరాస్యులైన ప్రవాస ఉద్యోగులు ఎంతమంది ఉన్నారంటే..

ABN , First Publish Date - 2022-04-19T13:35:13+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో స్థానికుల కంటే ప్రవాసులే అధిక సంఖ్యలో ఉపాధి పొందుతుంటారనే విషయం తెలిసిందే.

Kuwait: ప్రభుత్వ రంగంలో నిరక్షరాస్యులైన ప్రవాస ఉద్యోగులు ఎంతమంది ఉన్నారంటే..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో స్థానికుల కంటే ప్రవాసులే అధిక సంఖ్యలో ఉపాధి పొందుతుంటారనే విషయం తెలిసిందే. అయితే, గడిచిన ఐదేళ్ల నుంచి ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. వలసదారుల సంఖ్య క్రమంగా పెరిగిపోవడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయనే కారణంతో అక్కడి సర్కార్ 2017లో కువైటైజేషన్ పాలసీని తీసుకొచ్చింది. దీంతో గత ఐదేళ్లలో అటు ప్రైవేట్ సెక్టార్‌తో పాటు ఇటు ప్రభుత్వం రంగంలో కూడా ప్రవాస ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే కువైత్ ప్రభుత్వం ప్రవాసులకు రెసిడెన్సీ, వర్క్ వీసాల విషయంలోనూ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. 


ప్రధానంగా కొన్ని ఉద్యోగాలకు ఇంతకుముందు ఎలాంటి  విద్యార్హత అవసరం లేకున్నా.. ఇప్పుడు మాత్రం కండిషన్స్ అప్లై అంటోంది. దీంతో నిరక్షరాస్యులైన, తగిన విద్యర్హతలేని చాలామంది ప్రవాసులు తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు. ఇలా ప్రభుత్వ రంగంలో నిరక్షరాస్యులైన ప్రవాసుల సంఖ్య గడిచిన ఐదేళ్లలో ఏకంగా 31శాతం మేర తగ్గినట్లు తాజాగా వెలువడిన ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం కువైత్ ప్రభుత్వ సెక్టార్‌లో 2021 డిసెంబర్ నాటికి 276 మంది నిరక్షరాస్యులైన ప్రవాస ఉద్యోగులు ఉన్నారు. అదే 2017 డిసెంబర్‌లో ఈ సంఖ్య 402గా ఉంది. అంటే గత ఐదేళ్లలో 126 మంది తగ్గిపోయారు.          

Updated Date - 2022-04-19T13:35:13+05:30 IST