ఎఫ్‌బీ నుంచి క్లౌడ్‌కు ఫొటోలు, వీడియోలు...!

ABN , First Publish Date - 2021-04-24T07:18:00+05:30 IST

ఫేస్‌బుక్‌ వినియోగదారుల్లో కొందరు పెద్ద సంఖ్యలో ఫొటోలు, వీడియోలు, మేటర్‌ పోస్ట్‌ చేస్తూ ఉంటారు. అయితే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేసినప్పుడు వాటన్నింటినీ డౌన్‌లోడ్‌ చేసుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని. అలాంటి వినియోగదారుల కోసం ఫేస్‌బుక్‌ ప్రత్యేకించి ‘ట్రాన్స్‌ఫర్‌’ టూల్‌ను పరిచయం చేసింది.

ఎఫ్‌బీ నుంచి క్లౌడ్‌కు ఫొటోలు, వీడియోలు...!

ఫేస్‌బుక్‌ వినియోగదారుల్లో కొందరు పెద్ద సంఖ్యలో ఫొటోలు, వీడియోలు, మేటర్‌ పోస్ట్‌ చేస్తూ ఉంటారు. అయితే ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేసినప్పుడు వాటన్నింటినీ డౌన్‌లోడ్‌ చేసుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని. అలాంటి వినియోగదారుల కోసం ఫేస్‌బుక్‌ ప్రత్యేకించి ‘ట్రాన్స్‌ఫర్‌’ టూల్‌ను పరిచయం చేసింది. దీని సహకారంతో పెద్దగా శ్రమించకుండానే యావత్తు సమాచారాన్ని ఫేస్‌బుక్‌ నుంచి మనం కోరుకున్న చోటుకు బదిలీ చేసుకోవచ్చు.

ఠి ఫేస్‌బుక్‌ తెరిచి సెట్టింగ్స్‌ అండ్‌ ప్రైవసీ ఎక్కడ ఉందో చూడండి

ఠి సెట్టింగ్స్‌ను టాప్‌ చేసి, ఎఫ్‌బీ ఇన్ఫర్మేషన్‌ ఆప్షన్‌ను టాప్‌ చేయండి. అందులోనే ట్రాన్స్‌ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ ఉంటుంది. ఇన్ఫర్మేషన్‌ కాపీని ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. 

ఠి వెరిఫికేషన్‌ కోసం పాస్‌వర్డ్‌ను రీ ఎంటర్‌ చేయండి. పోస్టులు, ఫొటోలు, వీడియోలు వేటిని బదిలీ చేయాలని అనుకుంటున్నారో... వాటిని ఎంపిక చేసుకోండి. 

ఠి డ్రాప్‌-డౌన్‌ మెనూ నుంచి ఎక్కడికి ట్రాన్స్‌ఫర్‌ చేయాలో ఎంచుకోండి. గూగుల్‌ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌, ఇతర క్లౌడ్‌ స్టోరేజ్‌ సర్వీసులు... వీటిలో ఏదో ఒకటి ఎంచుకోండి.

ఠి కన్‌ఫర్మ్‌ చేస్తే చాలు, డేటా బదిలీ అవుతుంది. ఫేస్‌బుక్‌ కూడా అదే విషయాన్ని కన్‌ఫర్మ్‌ చేస్తుంది.

Updated Date - 2021-04-24T07:18:00+05:30 IST