Shocking: ఆ కుర్చీలను చూస్తే ఆఫీస్‌కు వెళ్లాలంటేనే భయమేస్తుంది.. శవపేటిక ఆకారంలో కుర్చీలను ఎందుకు తయారు చేశారంటే..

ABN , First Publish Date - 2022-09-27T20:38:41+05:30 IST

ప్రస్తుత కంప్యూటర్ యుగంలో అందరూ గంటల గంటలు కుర్చీల్లో కూర్చునే పని చేయాల్సి వస్తోంది.

Shocking: ఆ కుర్చీలను చూస్తే ఆఫీస్‌కు వెళ్లాలంటేనే భయమేస్తుంది.. శవపేటిక ఆకారంలో కుర్చీలను ఎందుకు తయారు చేశారంటే..

ప్రస్తుత కంప్యూటర్ యుగంలో అందరూ గంటల గంటలు కుర్చీల్లో కూర్చునే పని చేయాల్సి వస్తోంది. ఏకధాటిగా ఎనిమిది గంటలు కుర్చీల్లో కూర్చుని పని చేసుకుంటూ ఉంటారు. అలా గంటలు గంటలు కుర్చీలకు అతుక్కుపోతే ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయని హెచ్చరికలు వినబడుతూ ఉంటాయి. అలా కుర్చీలకు అతుక్కుపోతే మరణం ఖాయమని, సుదీర్ఘంగా కూర్చునే అలవాటు స్మోకింగ్ చేయడంతో సమానమని అంటూంటారు. ఓ సంస్థ అయితే మరో అడుగు ముందుకేసి కుర్చీలనే శవ పేటిక ఆకారంలో తయారు చేసింది. 


ఇది కూడా చదవండి..

Aadhaar Cards For Dinner: పెళ్లిలో వింత కండీషన్.. ఆధార్ కార్డు ఉంటేనే విందు భోజనానికి అనుమతి..!


యూకేకు చెందిన Chairbox అనే సంస్థ ఈ కుర్చీలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ శవపేటిక కుర్చీ ప్రత్యేకతను వివరిస్తూ `మేము మా కొత్త ఉత్పత్తిని పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఇది The Last Shift Office Chair. ఒక ఉద్యోగి పనిచేస్తూ చనిపోతే, మేనేజ్‌మెంట్ టాప్ కవర్‌ వేసి, కుర్చీతో సహా కార్పొరేట్ స్మశానవాటికకు తరలించవచ్చు. సరళమైనది అయినప్పటికీ సమర్థవంతమైనది` అని ఆ కంపెనీ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. 


మనుషుల శారీరక నిర్మాణం ప్రకారం ఎక్కువ గంటలు కూర్చుని పని చేయకూడదని సంస్థ పేర్కొంది. రోజులో ఎంత వ్యాయామం చేసినా సుదీర్ఘంగా కూర్చుంటే ఉపయోగం ఉండదని, దీని గురించి ఉద్యోగులందరికీ అవగాహన కల్పించాలని పేర్కొంది. ఈ కుర్చీ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసిన కొందరు నెటిజన్లు `నో థాంక్స్` అని కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-09-27T20:38:41+05:30 IST