మా భూములను సర్వే చేయొద్దు

ABN , First Publish Date - 2021-04-24T05:05:54+05:30 IST

ఇమాంపూర్‌లో పరిశ్రమల స్థాపనకు సేకరించనున్న భూములను సర్వే చేసేందుకు వచ్చిన టీఎ్‌సఐఐసీ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఉన్న కొద్దిపాటి భూములను లాక్కుంటే బతికేదెట్లా గని, ఈ ఆలోచన మానుకోవాలని అధికారులను వేడుకున్నారు. రెండు రోజులాగితే ప్రజాప్రతినిధులను ఒప్పించి ఈ ప్రతిపాదనలను నిలుపుదల చేయిస్తామని చెప్పారు. దీంతో చేసేదేమీలేక అధికారులు వెనుదిరిగి వెళ్లారు. రెండు రోజుల తర్వాత మళ్లీ వస్తామని చెప్పారు.

మా భూములను సర్వే చేయొద్దు
ఇమాంపూర్‌ గ్రామ పంచాయతీలో రైతులతో మాట్లాడుతున్న అధికారులు

అధికారులను వెనక్కి పంపిన ఇమాంపూర్‌ రైతులు


తూప్రాన్‌, ఏప్రిల్‌ 23: ఇమాంపూర్‌లో పరిశ్రమల స్థాపనకు సేకరించనున్న భూములను సర్వే చేసేందుకు వచ్చిన టీఎ్‌సఐఐసీ అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఉన్న కొద్దిపాటి భూములను లాక్కుంటే బతికేదెట్లా గని, ఈ ఆలోచన మానుకోవాలని అధికారులను వేడుకున్నారు. రెండు రోజులాగితే ప్రజాప్రతినిధులను ఒప్పించి ఈ ప్రతిపాదనలను నిలుపుదల చేయిస్తామని చెప్పారు. దీంతో చేసేదేమీలేక అధికారులు వెనుదిరిగి వెళ్లారు. రెండు రోజుల తర్వాత మళ్లీ వస్తామని చెప్పారు.  

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇమాంపూర్‌లోని అసైన్డ్‌ భూములను పరిశ్రమల స్థాపనకు టీఎ్‌సఐఐసీకి అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌కు సమీపంలో హెచ్‌ఎండీఏ పరిధిలో జాతీయ రహదారికి 44కు పక్కనే ఉన్న ఈ భూములు అన్ని విధాలా అనుకూలమని భావించిన అధికారులు శుక్రవారం ఇమాంపూర్‌కు వచ్చారు. ఈ వ్యవహారంపై ముందే గమనించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక శుక్రవారం.. ‘మా భూములను లాక్కోవద్దు’ శీర్షికతో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అసైౖన్డ్‌ భూములను సర్వేకు వచ్చిన వారిలో టీఎ్‌సఐఐసీ అధికారి నజీబ్‌ అహ్మద్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సంతో్‌షకుమార్‌, సర్వేయర్‌ శశికాంత్‌ ఉన్నారు. తమ భూములను తీసుకుని 250 కుటుంబాల బతుకులను ప్రశ్నార్థకం చేయొద్దని సర్పంచు ఎల్లం ఆఽధ్వర్యంలో రైతులు అఽధికారులను కోరారు. రెండు రోజులు ఆగాలని, ప్రజాప్రతినిధులను గడ ప్రత్యేక అధికారిని కలుస్తామని చెప్పడంతో సోమవారం వరకు అవకాశమిస్తామని చెప్పి అధికారులు వెళ్లిపోయారు.  


Updated Date - 2021-04-24T05:05:54+05:30 IST