RED ALERT : పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు...ఐఎండీ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-09-06T16:58:25+05:30 IST

అల్పపీడన ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు (heavy rainfall)కురుస్తాయని...

RED ALERT : పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు...ఐఎండీ హెచ్చరిక

న్యూఢిల్లీ: అల్పపీడన ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు (heavy rainfall)కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ)(IMD) మంగళవారం వెల్లడించింది. రాగల మూడు రోజుల పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో (Karnataka, Tamil Nadu, Andhra Pradesh) అతి భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు.లక్షద్వీప్, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్ లలో(Kerala, Lakshadweep, Telangana and coastal Andhra Pradesh) 6,7,9 తేదీల్లో అతి భారీవర్షాలు(MORE RAINS) కురుస్తాయని ఐఎండీ వివరించింది. కేరళ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది. 


తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో మంగళవారం అతిభారీ వర్షాలు(very heavy rainfall) కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్(RED ALERT) జారీ చేసింది. రాజధాని నగరమైన తిరువనంతపురంలో విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఎర్నాకుళం, ఇడుక్కి, పాలక్కాడ్, మణప్పురం, కోజికోడ్, వయనడ్, కన్నూర్ జిల్లాల్లోనూ భారీవర్షాలు కురిశాయి. పాలోడిలోని మంకాయం జలపాతం వద్ద మెరుపు వరదల్లో చిక్కుకొని ఇద్దరు మరణించారు.తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి,మెట్టుపాలయం, ఉద్గమండలం ప్రాంతాల్లో భారీవర్షాల వల్ల కొండచరియలు(LANDSLIDES IN TAMIL NADU) విరిగిపడ్డాయి. 


కల్లార్ హిల్ గ్రోవ్ ప్రాంతాల్లో రైలు పట్టాలపై కొండచరియలు విరిగిపడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కర్ణాటక రాష్ట్రంలోనూ భారీవర్షాల వల్ల సిలీకాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి. రెయిన్ బౌ డ్రైవ్ లేఅవుట్, సన్నీ బ్రూక్ లేఅవుట్, సార్జాపూర్ రోడ్డు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. బెంగళూరు నగరం వరదలతో అతలాకుతలమైంది. వరదల బారినపడిన బెంగళూరు నగరంలో సహాయ పునరావాస పనుల కోసం రూ.600కోట్లను కేటాయించినట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చెప్పారు.  


Updated Date - 2022-09-06T16:58:25+05:30 IST