IMD: ఏపీ,ఒడిశా రాష్ట్రాలకు తుపాన్ హెచ్చరిక

Published: Sat, 25 Sep 2021 09:09:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
IMD: ఏపీ,ఒడిశా రాష్ట్రాలకు తుపాన్ హెచ్చరిక

న్యూఢిల్లీ : భారత వాతావరణశాఖ ఆంధ్రప్రదేశ్‌,ఒడిశా రాష్ట్రాలు తుపాన్ హెచ్చరిక జారీ చేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 12 గంటల్లో తుపానుగా మరే అవకాశముందని ఐఎండీ తెలిపింది.ఆదివారం నాటికి తుపాన్ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశముందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలు,ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాల్లో శనివారం నుంచి మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


IMD: ఏపీ,ఒడిశా రాష్ట్రాలకు తుపాన్ హెచ్చరిక

భారత వాతావరణశాఖ పలు రాష్ట్రాలకు ముందస్తు తుపాన్ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నందున ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,ఒడిశా, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) హెచ్ఛరించింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ శనివారం జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ శనివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. 

గుజరాత్ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఈ నెల 27వతేదీ వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు కోరారు. ఢిల్లీలో శనివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం వర్షాలు పడ్డాయి. రోహిణి, ముఖర్బా చౌక్, ఆజాద్‌పూర్, రాణి బాగ్, నోయిడా, వివేక్ విహార్, దిల్షాద్ గార్డెన్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న ఐదు రోజుల్లో ఒడిశాలో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు.ఒడిశా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.మత్స్యకారులు లోతైన సముద్రంలోకి వెళ్లవద్దని శనివారం నాటికి తీరానికి తిరిగి రావాలని సూచించారు.ఒడిశాలోని భద్రక్, కేంద్రపారా, కటక్, ఖుర్దా, పూరి, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.