
చెన్నై : అల్పపీడనం కారణంగా తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) కేంద్రం వెల్లడించింది.నేడు, రేపు భారీవర్షాలు కురవనున్నందున ఐఎండీ అధికారులు మంగళవారం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 25,26 తేదీల్లో రెండు రోజులపాటు కూడా భారీవర్షాలు కురుస్తాయని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడన ప్రభావం వల్ల తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తమిళనాడు, కరైకల్, పుదుచ్చేరి, కేరళ ప్రాంతాల్లో వచ్చే ఐదురోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు వివరించారు.