లోక్‌ అదాలత్‌లతో సత్వరన్యాయం

ABN , First Publish Date - 2022-06-26T03:44:51+05:30 IST

ఇరువర్గాల పరస్పర ఆంగీకారంతో ఏ సమస్యకైనా సులభంగా పరిష్కారం లభిస్తుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసు లకు అంతిమ తీర్పునకు మార్గంసుగమం అవు తుంది.

లోక్‌ అదాలత్‌లతో సత్వరన్యాయం
లోక్‌అదాలత్‌పై సమీక్షలో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రశర్మ(ఫైల్‌)

- ఉచిత న్యాయసేవలకు వేదిక

- నేడు జాతీయ మెగా లోక్‌అదాలత్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌25: ఇరువర్గాల పరస్పర ఆంగీకారంతో ఏ సమస్యకైనా సులభంగా పరిష్కారం లభిస్తుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసు లకు అంతిమ తీర్పునకు మార్గంసుగమం అవు తుంది. ఇందులో భాగంగానే న్యాయ సేవాధికార సంస్థ ఉచితన్యాయసేవలకు వేదికఅవుతోంది. పెం డింగ్‌ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఆదివారం జాతీ య మెగాలోక్‌ అదాలత్‌ నిర్వహిస్తోంది.

డబ్బు, సమయం ఆదా..

కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృధా చేసు కుంటున్న కక్షిదారుల సమస్యలకు పరిష్కారం చూ పేది లోక్‌అదాలత్‌. చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో ఇరువర్గాలు రాజీకావడానికి ముందుకు వస్తే లోక్‌ అదాలత్‌లో సత్వరన్యాయం లభిస్తుంది. ఈ మెగాలోక్‌అదాలత్‌కు చైర్మన్‌గా న్యాయమూర్తి, సభ్యులుగా ఒక న్యాయవాది, ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఉంటారు. జాతీయ న్యాయసేవాసంస్థ ఆదే శాలమేరకు ప్రతిరెండునెలలకు ఒకసారి ప్రతికోర్టులో మెగా లోక్‌అదాలత్‌ నిర్వహిస్తారు. మరోవైపు ప్రతి శనివారం లోక్‌అదాలత్‌ నిర్వహించడానికి వీలుంది.

లోక్‌ అదాలత్‌దే అంతిమ తీర్పు..

లోక్‌ అదాలత్‌లో లభించిన తీర్పు అంతమం అవు తుంది. లోక్‌అదాలత్‌లలో పరిష్కరించిన కేసులపై మళ్లీ ఏ కోర్టులోనూ ఆప్పీలుకు వెళ్లే ఆవకాశం లేదు. ఇది చట్టబద్దమైన అంతిమతీర్పు. అందుకే ఆప్పీలుకు ఆవకాశంలేని న్యాయమైన అంతిమ తీర్పునకు లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈతీర్పు ఇరువర్గాల విజ యంగా భావించవచ్చు. లోక్‌ అదాలత్‌లో సివిల్‌, రాజీకిఅవకాశం ఉన్న క్రిమినల్‌కేసులు పరిష్కారానికి అవకాశం ఉంది.

Updated Date - 2022-06-26T03:44:51+05:30 IST