భైంసాలో ఘనంగా బతుకమ్మల నిమజ్జనం

ABN , First Publish Date - 2022-09-27T06:37:20+05:30 IST

రెవెన్యూ డివిజన్‌కేంద్రమైన భైంసాలో సోమ వారం ఆడపడుచులంత బతుకమ్మల నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు.

భైంసాలో ఘనంగా బతుకమ్మల నిమజ్జనం
భైంసాలో బతుకమ్మ ఘాట్‌ వద్ద మహిళల సందడి

భైంసా, సెప్టెంబరు26 : రెవెన్యూ డివిజన్‌కేంద్రమైన భైంసాలో సోమ వారం ఆడపడుచులంత బతుకమ్మల నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. మధ్యాహ్నం వేళలో తమ తమ ఇళ్లలో పూలు, పత్రాలతో బతుకమ్మ లను పేర్చుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా కాలనీలకు చెందిన మహిళలందరు మంగళహారతుల మధ్య బతుకమ్మలను కాలనీల పరిధిలోని ఆలయాల వద్దకు తీసుకెళ్లి ఒక్కచోటకు చేర్చి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం బతుకమ్మల చుట్టు కోలాటాలు వేస్తూ ఆటపాటలు ఆడుతూ బతుకమ్మలను స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టు బతుకమ్మ ఘాట్‌ వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. పట్టణ పరిధిలోని మహిళలంత బతు కమ్మలతో గడ్డెన్నవాగు ప్రాజెక్టు చేరుకోవడంతో అక్కడ జనసంద్రంగా మా రింది. పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలో పోలీసులు ట్రాఫిక్‌ సమస్య లు ఏర్పడకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. భైంసా పట్టణ మున్నూర్‌ కాపు సంఘం ప్రతినిధులు బతుకమ్మలతో వచ్చిన మహిళ మూర్తులకు స్వాగత కార్యక్రమాలు నిర్వహించారు. 

Updated Date - 2022-09-27T06:37:20+05:30 IST