Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లోనే గణేష్ విగ్రహాల నిమజ్జనం: భగవంత్‌రావు

ABN , First Publish Date - 2022-07-22T19:36:02+05:30 IST

గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేసి తీరుతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు.

Ganesh Immersion: హుస్సేన్‌సాగర్‌లోనే గణేష్ విగ్రహాల నిమజ్జనం: భగవంత్‌రావు

హైదరాబాద్: గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌(Hussainsagar)లోనే నిమజ్జనం(Immersion) చేసి తీరుతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు(Bhagavanth rao) స్పష్టం చేశారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం నిమజ్జనం ఏర్పాట్లను ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని అన్నారు. మండప నిర్వహకులు ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి మండపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంస్కృతి సాంప్రదాయ బద్ధంగా డీజే సినిమా పాటలు, జీన్స్ డాన్సులు లేకుండా ఉత్సవాలు జరపాలని భగవంత్ రావు సూచనలు చేశారు. 

Updated Date - 2022-07-22T19:36:02+05:30 IST