ఘనంగా దుర్గామాత నిమజ్జనం

ABN , First Publish Date - 2022-10-07T04:47:23+05:30 IST

శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి, శారద మాతల విగ్రహాలను గురువారం ఆసిఫాబాద్‌లోని పెద్దవాగులో ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్బంగా పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు.

ఘనంగా దుర్గామాత నిమజ్జనం
ఆసిఫాబాద్‌లో కోలాటం ఆడుతున్న మహిళలు,చిన్నారులు

- భాజాభజంత్రీలు, నృత్యాలతో ఊరేగింపు

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 6: శరన్నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవి, శారద మాతల విగ్రహాలను గురువారం ఆసిఫాబాద్‌లోని పెద్దవాగులో ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్బంగా పట్టణంలో శోభయాత్ర నిర్వహించారు. మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. మహిళలు మంగళ హరతులతో ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దవాగులో నిమజ్జనం చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌  కోవ లక్ష్మి సందీప్‌నగర్‌లోని దుర్గామాత మండలి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభయాత్రలో జడ్పీటీసీ అరి గెల నాగేశ్వర్‌రావు, డీసీసీ ఆధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్‌రావు, మాజీఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌ పాల్గొ న్నారు.

దహెగాం: మండలంలోని బీబ్రా, ఐనం, దహె గాం, ఇట్యాల, చిన్నరాస్పెల్లి, గెర్రెగ్రామాల్లో గురు వారం దుర్గామాతావిగ్రహ నిమజ్జనోత్సవాలను భక్తు లు ఘనంగా జరుపుకున్నారు. దుర్గాదేవిని దహెగాం మండల కేంద్రంలోని పలు వీధుల గుండా శోభా యాత్ర నిర్వహించారు. భక్తులు దాండియా నృత్యా లతో అలరించారు.

బెజ్జూరు: మండలంలోని పలుగ్రామాల్లో గురు వారం దుర్గామాత నిమజ్జనాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని రంగనాయక ఆలయ ప్రాంగ ణం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ఎంపీపీ రోజారమణి, జడ్పీటీసీ పుష్పలత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-10-07T04:47:23+05:30 IST