పొంచి ఉన్న ప్రమాదం

ABN , First Publish Date - 2021-10-12T04:54:00+05:30 IST

ఇక్కడ కనిపిస్తున్న ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరినవి. ఏళ్ల కిందట నిర్మించిన ఇవి వర్షానికి తడిసి, పొటుకు పెడుతున్నాయి. కొన్ని గోడలు కూలిపోయాయి. గత్యంతరం లేక ఒరిగిన పైకప్పుకు దూలాలు, కర్రలు పెట్టి అందులోనే నివాసం ఉంటున్నారు. అది ప్రమాదమని తెలిసినా వేరే మార్గంలేక ఉంటున్నామని బాధితులు చెబుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం
వనపర్తి జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో గల రాజనగరంలో శిథిలావస్థకు చేరిన ఇంటిని చూపుతున్న వృద్ధుడు

ఇక్కడ కనిపిస్తున్న ఇళ్లన్నీ శిథిలావస్థకు చేరినవి. ఏళ్ల కిందట నిర్మించిన ఇవి వర్షానికి తడిసి, పొటుకు పెడుతున్నాయి. కొన్ని గోడలు కూలిపోయాయి. గత్యంతరం లేక ఒరిగిన పైకప్పుకు దూలాలు, కర్రలు పెట్టి అందులోనే నివాసం ఉంటున్నారు. అది ప్రమాదమని తెలిసినా వేరే మార్గంలేక ఉంటున్నామని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. అయిజ మండలం కొత్తపల్లిలో గుడిసె గోడ కూలి ఆదివారం ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో ప్రమాదకరంగా మారిన ఇళ్లపై ‘ఆంధ్రజ్యోతి’ ఫొటో ఫీచర్‌..

- ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ వనపర్తి/ఊట్కూరు/అలంపూర్‌ చౌరస్తా








Updated Date - 2021-10-12T04:54:00+05:30 IST