ఇమ్యూన్ బూస్టింగ్ సూప్
ABN , First Publish Date - 2020-03-07T17:41:34+05:30 IST
కొబ్బరి నూనె - ఒక టీస్పూన్, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, పుట్టగొడుగులు - అరకేజీ, ఉప్పు - తగినంత, మిరియాల పొడి
కావలసినవి: కొబ్బరి నూనె - ఒక టీస్పూన్, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, పుట్టగొడుగులు - అరకేజీ, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - ఒక టీస్పూన్, పసుపు - చిటికెడు.
తయారీ:
* పుట్టగొడుగులను కట్ చేయాలి.
* పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి.
* వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి మరికాసేపు వేగనివ్వాలి.
* పుట్టగొడుగులు వేసి పదినిమిషాల పాటు ఫ్రై చేయాలి.
* తరువాత కొద్దిగా నీళ్లుపోసి ఉడికించాలి. మిరియాల పొడి చల్లుకుని దింపుకోవాలి.
* ఈ సూప్‌ను వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో పెట్టుకుని తరువాత కూడా సర్వ్ చేసుకోవచ్చు.