రోగనిరోధక శక్తి -సర్వ రోగ నివారిణి

Published: Tue, 06 Jul 2021 12:05:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon

సమకాలీన యుగంలో తీవ్ర వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు శతాబ్ధి చరిత్ర కలదు. 1918 సం.లో స్పానిష్‌ ఫ్లూ విస్తరించి వేలాది మంది మృతి చెందటం, లక్షలాది మంది రోగగ్రస్తులవడం అందరికీ తెలుసు, నేటికి కూడా అమెరికాలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రతి పౌరుడు వైరస్‌ వ్యాక్సిన్‌ వేసుకోవడం, స్పానిష్‌ ఫ్లూ విశృంఖల విజృంభణకు ప్రతిబింబం. వైద్య వృత్తిలో సాధారణంగా నెలకొని ఉన్న నానుడి మందులతో వారం రోజులలో, మందు లేకుండా ఏడు రోజులలో వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది. ఈ నానుడి వల్ల ఏ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ను అయిన మన రోగ నిరోధక శక్తి ఎదిరించగలదు. పరిష్కారం చూపగలదు అనేది ప్రస్ఫుటం అవుతుంది. జీవశాస్త్ర అధ్యయనంలో రకరకాల సూక్ష్మ క్రీముల ప్రమేయం అవి కలిగించే రోగాలు వాటి విశృంఖలత్వంపై ఎన్నో పరిశోధనలు పరిష్కారాలు మనం అందరికీ విదితమే.


గత రెండు దశాబ్దాలుగా సూక్ష్మ క్రీముల నిరోధానికి ఎన్నో మందులు ఉత్పత్తి చేయటం జరిగింది. యాంటీ బయాటిక్స్‌ ఎక్కువ స్థాయిలో వినియోగించడం జరిగింది. దీని ప్రభావం నేడు మల్టీ డ్రగ్‌  రెసిస్టెంట్‌ బ్యాక్టీరియా ఉద్భవించడానికి దారి తీసింది. ఈనాడు ప్రతి రోగి యాంటీ బయాటిక్స్‌ సెన్సిటివిటీ టెస్ట్‌ అనగా రోగి శరీరంలో ఉన్న సూక్ష్మ క్రీములు ఏ యాంటీ బయాటిక్స్‌కు స్పందిస్తాయి. ఏ యాంటీ బయాటిక్స్‌ను నిరోధిస్తాయి, అనే అంశం రోగ నిర్ధారణ పరీక్షలలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక రోగికి మూత్ర నాళాలలో సూడో మోనాస్‌ అనే సూక్ష్మ క్రీమి వలన ఇన్‌ఫెక్షన్‌ సంభవిస్తే సెప్టోజిడైమ్‌ సహా పలు యాంటీ బయాటిక్స్‌ వినియోగించినప్పటికీ ఫలితం దక్కనప్పుడు యాంటీ బయాటిక్స్‌ సెన్సిటివిటీ టెస్ట్‌ చేయగా రోగి కేవలం సెప్టోజిడైమ్‌కే స్పందించడం జరిగింది.


ఆ దశలో బయో గ్రీన్‌ రెమిడీస్‌ కంపెనీ ఉత్పత్తి బయోవిన్‌ క్యాప్సుల్స్‌తోపాటు సాధారణ యాంటీ బయాటిక్స్‌ ఆమాక్సిసిలిన్‌ కలిపి వాడితే వెంటనే జబ్బు నయం అయింది. అనగా ఆహార పదార్ధాల నుంచి తయారు చేసిన బయోవిన్‌లో యాంటీ బయాటిక్స్‌ కన్నా అద్భుతంగా పని చేయటంలో అమాక్సిసిలిన్‌కు చేయూతనివ్వటం జరిగింది. ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే అర్ధం అయ్యే అంశం తరచుగా యాంటీ బయాటిక్స్‌ వల్ల వాటి వాటి ప్రభావం రోగంపై ఉండక పోవడం గమనార్హం. బయోవిన్‌లో వైరస్‌ మరియు బ్యాక్టీరియాను అంతమొందించే గుణంతోపాటు మన శరీరంలో ఉండే ఆరోగ్య కణాల జోలికి వెళ్లక పోవడం వలన మనకు ప్రకృతి సిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తిలో మార్పులు చెందకుండా తద్వారా రోగంపై విజయం సాధించడం జరిగింది. ఈ మధ్య ఇమ్యునో సప్రసంట్స్‌ అనే మందులు వాడకం కూడా అధికంగా జరుగుతోంది, ఎందుకంటే కొన్ని వ్యాధులు నయం చేసే మందులను మన రోగ నిరోధక శక్తి ఎదురుకోవటం వలన శరీరంలో పలు పెను మార్పులు జరగటం చూసాము. ఈ మార్పులు ఒక్కొక్కసారి ప్రమాదరకంగా కూడా ఉంటాయి. అందుకనే ఇమ్యునో సప్రస్సెంట్స్‌ వాడి రోగ నిరోధక శక్తిని తగ్గించి వ్యాధి నిరోధించడానికి మందులు వాడటం జరుగుతుంది.


గత సంవత్సర కాలంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ల జోలికి వెళ్లకుండా లేని వాళ్ల మీదనే తన ప్రభావం చూపించడం జరిగింది, అనగా ప్రతి చిన్న రుగ్మతకు యాంటీ బయాటిక్స్‌, ఇమ్యునో సప్రస్సెంట్స్‌ వాడి మన రోగ నిరోధక శక్తిని నీరు  కార్చడం మంచిది కాదు.మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తిని రక్షించుతూ పెంపొందించుకుంటూ ఉంటే ఎలాంటి చిన్న, పెద్ద వ్యాధులు రావు అని నిరూపితమైనది. సరైన పౌష్టిక ఆహారం తీసుకుంటూ ఉంటే మన రోగ నిరోధక శక్తి పెరిగి జబ్బులు వ్యాధులు రాకుండా కాపాడటం జరుగుతుంది.


ఆహార ఉత్పత్తుల నుంచి తయారు చేసిన బ్లిస్‌ అనబడే మందు, బ్లిస్‌ బిస్కెట్‌ రెండు కూడా రోగ నిరోధక శక్తి పెంచడంలో తద్వారా వ్యాధులు నివారణలో ముందు ఉంటాయి అనేది నిరూపితం అయినది.శరీరంలో పౌష్టిక విలువలు ఉన్నచో బ్యాక్టీరియల్‌ మరియు వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ నిరోధించడం సులభం, అలాగే ఏ సూక్ష్మ క్రీములు గానీ వైరస్‌ గానీ దాడి చేసినప్పుడు కంగారు పడి జరిగే రోగ నిరోధక శక్తి స్పందన తద్వారా సంభవించే చావులు నుండి కూడా నివారణ పొందవచ్చు. రకరకాల మ్యుటేషన్స్‌ చెందుతూ బీభత్సం సృష్టిస్తున్న కరోనాను ఎదురుకోవడానికి రోగ నిరోధక శక్తి సరైన సమాధానం. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.