విటమిన్‌ - డి కోసం రోజుకు ఎండలో ఎంతసేపు నిలబడాలి?

Published: Thu, 19 May 2022 13:49:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విటమిన్‌ - డి కోసం రోజుకు ఎండలో ఎంతసేపు నిలబడాలి?

ఆంధ్రజ్యోతి(19-05-2022)

ప్రశ్న: విటమిన్‌ - డి ఆవశ్యకత ఏమిటి? ఎండాకాలంలో రోజుకు ఎంతసేపు ఎండలో గడిపితే శరీరానికి తగినంత విటమిన్‌- డి లభిస్తుంది?


- ప్రణవి, తిరుపతి


డాక్టర్ సమాధానం: విటమిన్‌- డి ఎముకల నిర్మాణానికి కీలకమైంది. కాల్షియం, పాస్ఫరస్‌ ఖనిజాలను ఎముకల్లోకి శోషించుకొనేందుకు విటమిన్‌- డి అవసరం. శరీరంలో ఈ విటమిన్‌ తగినంత లేనప్పుడు ఆహారంలో కేవలం పది నుండి పదిహేను శాతం మాత్రమే శరీరం శోషించుకోగలుగుతుంది. ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడం, రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రించడం, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో కూడా విటమిన్‌ - డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్‌ కేవలం కొవ్వులో మాత్రమే కరిగే పదార్థం. అందుకే కొవ్వులు ఎక్కువగా ఉండే కొన్ని రకాల చేపల్లోనూ, కాలేయంలో, గుడ్డులోని పచ్చసొనలో, ఫార్టిఫై చేసిన పాలు, పాలపదార్థాల్లో కొంత విటమిన్‌ - డి లభిస్తుంది. సూర్యరశ్మిలో ఉండే యువీ- బీ కిరణాలు మన చర్మంపై పడినప్పుడు శరీరంలో విటమిన్‌- డి తయారవుతుంది. కాబట్టి యువీ-బీ కిరణాలు అధికంగా ఉండే సమయం, ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో కనీసం పదిహేను ఇరవై నిమిషాలపాటు చర్మంపై నేరుగా ఎండపడేట్టు గడిపినట్టయితే శరీరంలోనే అవసరమైన విటమిన్‌ - డి ఉత్పత్తి అవుతుంది. ఎండాకాలంలో కూడా ఈ నియమం వర్తిస్తుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.