ఆకట్టుకున్న లవకుశ

ABN , First Publish Date - 2022-10-02T05:08:10+05:30 IST

శరన్నవరాత్రి సందర్భంగా నేక్‌నామ్‌ కళాక్షేత్రంలో హైదారబాదుకు చెంది న శ్రీ వినాయక నాట్యమండలి కళాకారుల బృందంచే నిర్వహిస్తున్న సు రభి నాటకాల్లో భాగంగా 8వ రోజు శనివారం ప్రదర్శించిన లవకుశ నా టకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న లవకుశ
లవకుశ నాటకంలో సీతారాములు

కడప (కల్చరల్‌), అక్టోబరు 1: శరన్నవరాత్రి సందర్భంగా నేక్‌నామ్‌ కళాక్షేత్రంలో హైదారబాదుకు చెంది న శ్రీ వినాయక నాట్యమండలి కళాకారుల బృందంచే నిర్వహిస్తున్న సు రభి నాటకాల్లో భాగంగా 8వ రోజు శనివారం ప్రదర్శించిన లవకుశ నా టకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తొమ్మిది రోజుల సురభి నాటకాల ప్రదర్శనలో భాగంగా ప్రదర్శించిన లవకుశ నాటకం ఆహుతులను, కళాభిమానులను కట్టిపడేసింది. సురభి కళాకారుడు శ్రీరాముడు, సీతా, లవకుశలు ఇతర పాత్రల్లో ప్రత్యక్షంగా ప్రదర్శించిన కొన్ని ఘట్టాలు నేటి మల్టీ ప్లెక్స్‌ సినిమాలకు ఏ మా త్రం తీసిపోకుండా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. వివిధ పాత్రల్లో కళాకారుల డైలాగులు, బృందగానాలు, వేషధారణ, లైటింగ్‌ ఎఫెక్ట్స్‌, అభినయాని కి లయబద్దమైన గీతం, సంభాషణలు పలికిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Updated Date - 2022-10-02T05:08:10+05:30 IST