ధరణికి మెరుగులు

ABN , First Publish Date - 2021-01-12T05:05:57+05:30 IST

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సహా భూ సమస్యలన్నీ త్వరలోనే పరి ష్కారం కానున్నాయి. భూ వివాదాల పరిష్కార మే లక్ష్యంగా కలెక్టర్ల ఆధ్వ ర్యంలో జిల్లాకో ట్రిబ్యునల్‌, ధరణిలో మరిన్ని ఆప్షన్‌లు ఇ చ్చి మరింత బలోపేతం చేస్తా మన్న సీఎం కేసీఆర్‌ హామీ అన్న దాతల్లో ఆనందం నింపుతోంది.

ధరణికి మెరుగులు

పలు ఆప్షన్లు అందుబాటులోకి

పార్ట్‌ బీ సమస్యల పరిష్కారంలో కదలిక

సాదాబైనామాకూ పచ్చజెండా

రెండు నెలల్లో వివాదాలకు పరిష్కారం

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మొదలైన కదలిక

కామారెడ్డి,  జనవరి 11: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సహా భూ సమస్యలన్నీ త్వరలోనే పరి ష్కారం కానున్నాయి. భూ వివాదాల పరిష్కార మే లక్ష్యంగా కలెక్టర్ల ఆధ్వ ర్యంలో జిల్లాకో ట్రిబ్యునల్‌, ధరణిలో మరిన్ని ఆప్షన్‌లు ఇ చ్చి మరింత బలోపేతం చేస్తా మన్న సీఎం కేసీఆర్‌ హామీ అన్న దాతల్లో ఆనందం నింపుతోంది. ప్ర భుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చ ట్టంలో మరిన్ని ఆప్షన్లు కల్పించి రెండు నెలల్లో పార్ట్‌ బీ సమస్యలు పరిష్కరించా లని సీఎం అధికారులను ఆదేశించడం రై తులకు ఊర టనిస్తోంది. తదనుగుణంగా కా మారెడ్డి జిల్లా అధికారులు సైతం ఆ దిశగా ప్ర యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్ని మండలాల్లో సమస్యలు

కామారెడ్డి జిల్లాలో ఉన్న 22 మండలాల పరిధిలో 4 లక్షల ఎకరాలకు పైగానే వ్యవసాయ భూములున్నా యి. ప్రభుత్వ, అసైన్డు భూములతో పాటు అటవీ, వక్ఫ్‌, దేవాదాయశాఖల భూములున్నాయి. వీటిలో చాలా వరకు పార్ట్‌ బీలో సమస్యలుగా మిగిలి ఉన్నాయి. జిల్లాకు ఒక ట్రి బ్యునల్‌ ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా కోర్టు ల పరిధిలోని సమస్యలకు మోక్షం కలగనుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి హద్దులు తేల్చనున్నారు. నవంబ రు నెలలో స్వీకరించిన సాదాబైనామా దరఖాస్తులను కూ డా పరిశీలించనున్నారు. రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌, గిఫ్ట్‌ డీడ్‌, మార్టిగేజ్‌ తప్పా మిగిలిన అంశాలను పరిష్కరించే ఆప్షన్లు ధరణిలో అందుబాటులోకి తేలేదు. దీంతో విరాసత్‌, భూము ల క్రయవిక్రయాల మ్యూటేషన్‌, సాదాబైనామా, ప్రభుత్వ భూముల కొనుగోలు, అమ్మకం, డిజిటల్‌ సంతకాలు, సర్వే నెంబర్లకు ఆధార్‌ సంఖ్య అనుసంధానికంచకపోవడం, విస్తీ ర్ణంలో వ్యత్యాసం, కోర్టు కేసులు ఇలా పలు రకాల పార్ట్‌ బీ సమస్యల పరిష్కారం కోసం రైతులు రోజుల తరబడి నిరీక్షి ంచాల్సి వస్తోంది. 

నిరీక్షణకు తెర

60 రోజుల్లో ప్రతీ భూ సమస్యకూ పరిష్కారం చూపే ది శగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించడంతో కదలిక మొదలైంది. ఒకే సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ, ప్రై వేటు భూములకు సంబంధించి నిషేధిత జాబితాలో నమో దైన వాటికి క్షేత్రస్తాయిలో విచారణ జరిపి పాస్‌ పుస్తకాలు జారీ చేయనున్నారు. పాతవిధానంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యా లయాల పరిధిలోని జనరల్‌ పవర్‌ ఆఫ్‌ పట్టా( జీపీఏ) వి ధానాన్ని ప్రస్తుతం అమలు చేయనున్నారు. ఇప్పటివరకు ఆర్డీవో, అదనపు కలెక్టర్‌ పరిధిలో ఉన్న భూముల కేసులకు సంబంధించి కొత్త చట్టం ప్రకారం కలెక్టర్‌కు బాధ్యతలు ఇచ్చారు. జిల్లాలో ట్రిబ్యునల్‌ కోర్టు ద్వారా వీటిని త్వరితగతి న పరిష్కరించనున్నారు. ధరణి సేవల్లో పలు ఆప్షన్లు అం దుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు సేల్‌, గిఫ్ట్‌డీడ్‌, వి రాసత్‌, మార్టిగేజ్‌, నాలాసవేలు ఉండగా కొత్తగా పెండింగ్‌ లో ఉన్న మ్యూటేషన్‌, కోర్టు కేసులకు సంబంధించి ఆర్డీవో, అదనపు కలెక్టర్‌ పరిధిలో దరఖాస్తులు పరిష్కరించే అవకా శం ఇచ్చింది. మ్యూటేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చ ని అధికారులు పేర్కొంటున్నారు.

సాదాబైనామాకు పచ్చజెండా

తెల్లకాగితాలపై క్రయవిక్రయాలు జరుపుకున్న వారికి హక్కు పత్రాలు లేక ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ ం రెండోసారి అవకాశం ఇవ్వడంతో గతంలో చేసుకోనివారు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. గత అక్టోబరు 31 వ రకు గడువు విధించగా అర్జీలు ఎక్కువవడంతో నవంబరు 10 వరకు గడువు పొడిగించారు. గత నాలుగేళ్ల క్రితం సా దాబైనామా అర్జీలను పరిష్కరించగా.. సగం వరకు పెండిం గ్‌లో ఉన్నాయి. వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు.

Updated Date - 2021-01-12T05:05:57+05:30 IST