పాక్‌లో కలకలం.. ప్రధాని ఇమ్రాన్‌కు పదవీ గండం!

ABN , First Publish Date - 2021-03-04T22:30:19+05:30 IST

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం వచ్చి పడింది. పార్లమెంట్‌లో ఆయన విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు.

పాక్‌లో కలకలం..  ప్రధాని ఇమ్రాన్‌కు పదవీ గండం!

ఇమ్రాన్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదవీ గండం వచ్చి పడింది. పార్లమెంట్‌లో శనివారం ఆయన విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఛీప్ కూడా పాల్గొన్నారు. స్థానిక కాల మానం ప్రకారం గురువారం సాయంత్రం 7.30 గంటలకు ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీ తాజాగా ప్రకటించారు.


బుధవారం సెనెట్‌కు ఎన్నికల్లో ఇమ్రాన్ క్యాబినెట్‌లోని ఆర్థిక శాఖ మంత్రి..  ప్రతిపక్ష నేత యూసఫ్ రజా గిలానీ చెతిలో  అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కేవలం 7 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. దీంతో పాక్ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సరైన సమయం కోసం ఎప్పటినుంచో వేచి చూస్తున్న పాక్ ప్రతిపక్ష పార్టీలు.. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పాక్ దిగువ సభ జాతీయ అసెంబ్లలో బలపరీక్ష నెగ్గడం ద్వారా ప్రతిపక్షాలకు ముకుతాడు వేయాలన్ని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించుకున్నారు. శుక్రవారం నాడే ఆయన విశ్వాసపరీక్షకు వెళతారని తొలుత అనేకమంది భావించినప్పటికీ శనివారం నాటికి ముహుర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే.. నేటి ప్రసంగంలో ఆయన ఏవిషయంపై చర్చిబోతున్నారనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్నారనే విశ్లేషణలు జోరందుకున్నాయి.

Updated Date - 2021-03-04T22:30:19+05:30 IST