అబ్బాయిలు గడ్డం పెంచకూడదు.. డీజేలు అసలే వాడకూడదు.. పెళ్లిళ్లలో కొత్త కండీషన్లు.. ఆ 19 గ్రామాల్లో..

ABN , First Publish Date - 2022-06-17T03:36:36+05:30 IST

దేశంలో ప్రాంతాలను బట్టి వివిధ సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. కొన్ని గ్రామాల్లో అయితే పెద్దలంతా కలిసి వారికి వారే కొన్ని కట్టుబాట్లు, నిబంధనలు అమలు చేస్తుంటారు. కొన్ని కట్టుబాట్ల..

అబ్బాయిలు గడ్డం పెంచకూడదు.. డీజేలు అసలే వాడకూడదు.. పెళ్లిళ్లలో కొత్త కండీషన్లు.. ఆ 19 గ్రామాల్లో..

దేశంలో ప్రాంతాలను బట్టి వివిధ సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. కొన్ని గ్రామాల్లో అయితే పెద్దలంతా కలిసి వారికి వారే కొన్ని కట్టుబాట్లు, నిబంధనలు అమలు చేస్తుంటారు. కొన్ని కట్టుబాట్ల గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటి నిబంధనలే ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామాల్లో విధించుకున్నారు. అబ్బాలులు గడ్డం పెంచకూడదు, శుభకార్యాల్లో డీజేలు అసలే వాడకూడదు.. వంటి నిబంధనలు విధించుకున్నారు. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్ రాష్ట్రం పాలి నగరంలో గురువారం కుమావత్ సొసైటీకి చెందిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సొసైటీకి చెందిన 19గ్రామాల్లో కొన్ని నిబంధనలు పాటించాలని నిర్ణయించుకున్నారు. వివాహ సమయంలో వరుడికి గడ్డం ఉండకూడదు, అలాగే ష్యాషన్ పేరుతో దుబారా ఖర్చులను పూర్తిగా తగ్గించాలి, డీజేలు, అలంకరణలకు వృథా ఖర్చులు చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వివాహం, నిశ్చితార్థం, అంత్యక్రియలు తదితర కార్యక్రమాల్లో నల్ల మందు, మద్యం తదితరాలను పూర్తిగా నిషేధించారు. సొసైటీకి చెందిన లక్ష్మణ్‌ ట్యాంక్‌, బొహ్రారామ్‌ మాల్వియా ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

16 ఏళ్ల కూతురికి రహస్యంగా పెళ్లి చేసిన తల్లి.. అంతకుముందు రోజు ఆమె చేసిన నీచమేంటో సీసీటీవీలో రికార్డవడంతో..


వివాహ సమయంలో వరుడిని అక్కడి వారు రాజుగా చూస్తారు. అందుకే అలాంటి సమయంలో ఇలాంటి నిబంధనలు పాటించాలని నిర్ణయించుకున్నారు. వరుడు గడ్డం పెంచితే కీడు కలుగుతుందని అక్కడి వారు భావిస్తారట. మరోవైపు వివాహ సమయంలో వధువు తరపు వారు గరిష్టంగా 2 తులాల బంగారం, 2 జతల వెండి కర్రలు, వధువు దుస్తులతో కూడిన వెండి కండోరను ఇచ్చేలా మాట్లాడుకున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణాదిలోని వివిధ నగరాల నుంచి 20 వేల మంది వలసదారులు.. 19 గ్రామాలలో నివాసం ఉంటున్నారు. వారు కూడా ఈ నిబంధనలు పాటించాల్సిందేనని సమావేశంలో నిర్ణయించారు.

వేదిక పైకి పెళ్లికూతురు గ్రాండ్‌ ఎంట్రీ.. అమ్మాయి అంటే ఇలా ఉండాలి..!

Updated Date - 2022-06-17T03:36:36+05:30 IST