పక్షం రోజుల్లో కూతురు పెళ్లి.. అంతలోనే తండ్రి అనంతలోకాలకు

ABN , First Publish Date - 2020-11-26T06:37:23+05:30 IST

పదిహేను రోజుల్లో కూతురు పెళ్లి... అంతలోనే తండ్రి గుండె ఆగింది.

పక్షం రోజుల్లో కూతురు పెళ్లి.. అంతలోనే తండ్రి అనంతలోకాలకు

మెదక్‌ అర్బన్‌, నవంబరు 25: పదిహేను రోజుల్లో కూతురు పెళ్లి... అంతలోనే తండ్రి గుండె ఆగింది. మెదక్‌ పట్టణంలోని ఫతేనగర్‌ చెందిన మహహ్మద్‌ అబ్దూల్‌ హామీద్‌(54) వెల్దుర్తి పీహెచ్‌సీలో సూపరిండెంట్‌గా పని చేస్తున్నారు. పది రోజుల కింద చాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు గుండె సంబంధిత టెస్టులు చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఏంజియోగ్రామ్‌ చేస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Updated Date - 2020-11-26T06:37:23+05:30 IST